భారత స్టాక్ మార్కెట్లు(Stock Market) వరుసగా నాలుగో సెషన్‌లో నష్టాన్ని చవిచూశాయి. అయితే బ్యాంకింగ్ స్టాక్స్‌లో రికవరీ కారణంగా నష్టాలు తగ్గాయి. గురువారం సాయంత్రం 5:30 గంటలకు విడుదల కానున్న ఏప్రిల్ రిటైల్ లేదా వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం డేటా కోసం పెట్టుబడిదారులు వేచిచూస్తున్నారు. బుధవారం బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్(Sensex) 276 పాయింట్లు క్షీణించి 54,088 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ(NSE) నిఫ్టీ 73 పాయింట్లు పతనమై 16,167 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.36 శాతం, స్మాల్ క్యాప్ 2.91 శాతం క్షీణించాయి. సబ్-ఇండెక్స్‌లు నిఫ్టీ మెటల్ 5.20, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.24, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ 2.29 శాతం వరకు పడిపోయాయి. నిఫ్టీ IT 1.24, నిఫ్టీ ఆటో 0.91, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 0.69 శాతం వరకు పతనమయ్యాయి.
30 షేర్ల BSE ఇండెక్స్‌లో L&T, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, NTPC, ఇన్ఫోసిస్, మారుతీ, పవర్‌గ్రిడ్, ITC, HCL టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ (హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్), ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, టాటా స్టీల్ లాభాల్లో స్థిరపడ్డాయి.
Read Also.. LIC IPO: ఎల్‌ఐసీ లిస్టింగ్‌పై పెట్టుబడిదారుల్లో ఆందోళన.. ఇష్యూ ధర కంటే తక్కువకు లిస్టయ్యే అవకాశం..!