Business Ideas: నెలకు రూ.1 లక్ష సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్‌తో మీ కల నెరవేరడం ఖాయం..

పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయాలనుకునే వారికి సెల్ఫీ కాఫీ ఒక అద్భుత అవకాశం. కేవలం 2 లక్షల రూపాయల ప్రారంభ పెట్టుబడితో నెలకు 80 వేల నుండి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ ట్రెండింగ్ బిజినెస్ లో కాఫీ, ఇతర పానీయాలపై ఫొటోలు ముద్రించి కస్టమర్లను ఆకట్టుకోవచ్చు.

Business Ideas: నెలకు రూ.1 లక్ష సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్‌తో మీ కల నెరవేరడం ఖాయం..
Indian Currency 2

Updated on: Oct 16, 2025 | 7:35 AM

మంచి బిజినెస్చేసి, బాగా డబ్బులు సంపాదించాలనే కల చాలా మందికి ఉంటుంది. కానీ, పెట్టుబడి లేకనో, లేదా బిజినెస్చేయాలో తెలియక ఆగిపోతుంటారు. మరించి కాన్సెప్ట్ఉంటే మాత్రం బిజినెస్లో రాణించే సత్తా చాలా మందిలో ఉంటుంది. అలా బిజినెస్చేయాలనే కోరిక బలంగా ఉన్న వారి కోసం ఒక మంచి బిజినెస్ఐడియాను తీసుకొచ్చాం. అదేంటో ఇప్పుడు చూద్దాం.. కేవలం రెండు లక్షల రూపాయల పెట్టుబడితో చేయగలిగే ఈ బిజినెస్ ద్వారా ప్రతినెల 80 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. కేవలం రెండు లక్షల రూపాయల్లో చేయగలిగే ఈ బిజినెస్ పేరు సెల్ఫీ కాఫీ బిజినెస్ ( Selfie Coffee బిజినెస్ ప్లాన్). ఈ బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు. మార్కెట్లో ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తున్న ఈ బిజినెస్ ను మీరు ముందుగానే ప్రారంభించడం ద్వారా త్వరగా క్లిక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

ఇంతకీ Selfie Coffee అంటే ఏంటి?

ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతున్నటువంటి ఈ బిజినెస్లో ముఖ్యంగా కాఫీ పైన ఉండే నురుగు లో ఎవరైనా ఒక వ్యక్తి ఫోటోను ముద్రించవచ్చు. దీనికోసం ఫుడ్ గ్రేడెడ్ కలర్స్ ఉపయోగించి ప్రింట్ చేసే 3d ప్రింటర్ కావాల్సి ఉంటుంది. ఫోటో ప్రింట్ అయిన కాఫీని చూసేందుకు చాలా ముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, కపుల్స్, అలాగే సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ త్రీడి ఇమేజ్ ఫుడ్ కలర్ ప్రింటింగ్ కాఫీపై మాత్రమే కాదు. లస్సీ, థిక్ షేక్, కేకులు, ఫ్రూట్ జ్యూస్, మిల్క్ షేక్ వంటి వాటి పైన కూడా ప్రింట్ చేయవచ్చు. కస్టమర్ఆర్డర్పై మనం అలా చేసి ఇస్తే.. ఇవాళ్లు థ్రిల్అవ్వడమే కాకుండా షాపుకు ఎక్కువ సార్లు విజిట్చేస్తారు.

ఈ బిజినెస్ కోసం ముఖ్యంగా Mini Coffee Printer మెషిన్ కావాలి. దీని ధర సుమారు 1.20 లక్షల రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఇందులో food printer, Food-grade edible ink తో కలిపి మెషీన్ లభిస్తుంది. ఒక ఫిల్టర్ కాఫీ మిషన్ కొనుగోలు చేయాలి. దీని ధర సుమారు రూ. 20 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. లస్సి, ఫ్రూట్ షేక్ వంటివి తయారు చేయడానికి మిక్సర్ గ్రైండర్, బ్లెండర్ వంటివి కావాలి. ఇక ఈ బిజినెస్ సెట్అప్ చేసుకోవడానికి ఒక కాఫీ షాప్ ఏర్పాటు చేసుకుంటే మంచిది.

లాభాలు..

ఒక సెల్ఫీ కాఫీ ధర రూ.100 నుంచి రూ. 150 వరకు నిర్ణయించుకోవచ్చు. ఒక కప్పు మీద మనకు కనీసం వంద రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రతిరోజు ఒక 50 కాఫీలు, లస్సీలు అమ్మినా కనీసం 5000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇతర ఖర్చులు Rent, Staff, food Ink Refills వంటి ఖర్చులకు నెలకు రూ. 50 వేలు పోయినా నెలకు రూ. 1 లక్ష రూపాయల వరకూ సంపాదించుకునే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి