RTC Tickets Booking: జస్ట్ మూడు నిమిషాల్లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్.. వాట్సప్‌లో ఈ ఒక్క నెంబర్ ఉంటే చాలు..

జస్ట్ మూడే మూడు నిమిషాల్లో మీరు వాట్సప్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ కోసం రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వేరే వెబ్‌సైట్లు ఏమీ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు రోజూ వాడే వాట్సప్ ద్వారా ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకోండిలా..

RTC Tickets Booking: జస్ట్ మూడు నిమిషాల్లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్.. వాట్సప్‌లో ఈ ఒక్క నెంబర్ ఉంటే చాలు..
Whatsapp Services

Updated on: Dec 30, 2025 | 4:21 PM

APSRTC: ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే బస్టాండ్లలోని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ గంటల కొద్ది క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత టెక్నాలజీని ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురావడంతో ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆర్టీసీ వెబ్‌సైట్‌నే కాకుండా అబీ బస్, రెడ్ బస్ లాంటి అనేక ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా నిమిషాల్లోనే ఏ బస్సులో అయినా టికెట్ బుక్ చేసుకుని ప్రయాణం చేయవచ్చు. ప్రయాణానికి 60 రోజుల ముందుగానే మీరు టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇప్పుడు వేరే వేరే వెబ్‌సైట్లు ఓపెన్ చేయకుండానే వాట్సప్ ద్వారా సింపుల్‌గా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం.

వాట్సప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోండిలా..

ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా ప్రజలు వాట్సప్ ద్వారానే అన్నీ ప్రభుత్వ సేవలు ఈజీగా పొందవచ్చు. ప్రభుత్వ ధృవీకరణ పత్రాలతో పాటు దేవాలయాల్లో దర్శన టికెట్లు, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చు.  వాట్సప్ ద్వారానే పేమెంట్ చేసి ఆర్టీసీ బస్సుల్లో అత్యంత సులువుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు. కేవలం మూడు నిమిషాల్లోనే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.

ఎలానో చూడండి

-మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ నెంబర్ 95523 00009 మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి
– ఫోన్‌లో వాట్సప్ ఓపెన్  చేసి ఆ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పెట్టండి
-ఆర్టీసీ సేవలను ఎంచుకుని టికెట్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోండి
-ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారనే వివరాలు ఎంటర్ చేయండి
-ప్రయాణం తేదీని సెలక్ట్ చేసుకోండి
-బస్సు, సీటును ఎంచుకుని పేమెంట్ చేయండి
-బుకింగ్ వివరాలు మీకు వాట్సప్ మెస్సేజ్ ద్వారా అందుతాయి
-ఆ వివరాలు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు