SBI Special FD: సమయం లేదు మిత్రమా.. ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలంటే వెంటనే చేసేయండి.. లేకుంటే మంచి అవకాశం కోల్పోతారు..

|

Jun 17, 2023 | 6:00 PM

పరిమిత కాల ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలాష్ లో డిపాజిట్ చేసిన మొత్తానికి మెచ్యూరిటీ వ్యవధి 400 రోజులు ఉంటుంది. ఈ పథకం 2023, ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం అయ్యింది. మీరు ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే జూన్ 30లోపు చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ఈ పథకం ఉండదు.

SBI Special FD: సమయం లేదు మిత్రమా.. ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలంటే వెంటనే చేసేయండి.. లేకుంటే మంచి అవకాశం కోల్పోతారు..
Sbi
Follow us on

మన భారతదేశంలో ఫిక్స్ డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వినియోగదారులకు అపారమైన నమ్మకం. సురక్షిత పెట్టుబడి పథకం కావడం, అధిక వడ్డీతో స్థిరమైన ఆదాయం వస్తుండటంతో అందరూ దీనిలో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కాలంలో పలు బ్యాంకులు తమ ఎఫ్‌డీ ఖాతాల వడ్డీ రేట్లను సవరించాయి. చాలా బ్యాంకులు ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచాయి. ఇదే క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా ఎఫ్‌డీ రేట్లను సవరించింది. కొత్త పరిమిత-కాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలాష్‌ను ప్రారంభించింది. 400 రోజుల వ్యవధిలో వచ్చే ఈ పథకంలో సీనియర్ సిటిజనులకు 7.6%, ఇతరులకు 7.1% వడ్డీ రేటును అందిస్తోంది. అయితే పథకం కాల పరిమితి ఈ నెలాఖరుతో పూర్తయిపోతోంది. జూన్ 30 వరకూ మాత్రమే ఈ పథకం ప్రారంభించేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పథకం పూర్తి వివరాలు మరోసారి చూద్దాం..

ఇది ఎస్బీఐ అమృత్ కలష్ పథకం..

పరిమిత కాల ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలాష్ లో డిపాజిట్ చేసిన మొత్తానికి మెచ్యూరిటీ వ్యవధి 400 రోజులు ఉంటుంది. ఈ పథకం 2023, ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం అయ్యింది. మీరు ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే జూన్ 30లోపు చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ఈ పథకం ఉండదు. దీనిలో వడ్డీ రేటు సీనియర్ సిటిజన్‌లకు 7.6% , ఇతరులకు 7.1% అందిస్తారు. అలాగే సీనియర్ సిటిజన్లు, సిబ్బంది, స్టాఫ్ పెన్షనర్లు వారికి వర్తించే అదనపు వడ్డీ రేటుకు అర్హులు అని బ్యాంక్ తెలిపింది. దీనిని దరఖాస్తు చేసుకోవాలి అనుకొనే వారు బ్యాంక్ బ్రాంచ్, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా, ఎస్బీఐ యోనో యాప్ ద్వారా చేసుకోవచ్చు.

ఎవరు చేసుకోవచ్చు..

అమృత్ కలాష్ ఎఫ్ డీలో దాదాపు ఒక సంవత్సరం స్వల్ప కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏడాదిలోనే పూర్తవ్వాలి అనుకొనే వారు ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీనిలో వడ్డీ రేటు సంవ్సతర కాలానికి పోస్ట్ ఆఫీస్ ఇస్తున్న వడ్డీ కన్నా అధికం. పథకం కాలవ్యవధి 400 రోజులు కాబట్టి, ఈ పథకం సీనియర్ సిటిజన్లకు రూ.లక్ష డిపాజిట్‌పై దాదాపు రూ.8,600 వడ్డీని అందిస్తుంది. ఇతరులకు, రూ. 1 లక్ష డిపాజిట్ 400 రోజుల్లో వడ్డీగా రూ. 8,017 పొందుతారు.

ఇవి కూడా చదవండి

ఎస్బీఐలో ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు ఇలా..

  • 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ ప్రజలకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీని అందిస్తోంది.
  • 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ ప్రజలకు 4.5 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 5 శాతం వడ్డీని అందిస్తోంది.
  • 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ ప్రజలకు 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం వడ్డీని అందిస్తోంది.
  • 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 6.25 శాతం వడ్డీని అందిస్తోంది.
  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ ప్రజలకు 6.8 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.30 శాతం వడ్డీని అందిస్తోంది.
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీని అందిస్తోంది.
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ ప్రజలకు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీని అందిస్తోంది.
  • 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీ: బ్యాంక్ సాధారణ ప్రజలకు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..