
బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో లైట్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖాతాదారులు తమకు సహకరించాలని కోరింది.
”జూలై 16వ తేదీ శుక్రవారం రాత్రి 10.45 గంటల నుంచి జూలై 17 అర్ధరాత్రి 1.15 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ సర్వీసులు నిలిచిపోతాయని బ్యాంక్ పేర్కొంది. ఈ సమయంలో కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు చేయొద్దని సూచించింది” ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. దీనిని ఖాతాదారులు గమనించాలని.. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంలో తమకు సహకరించాలని ఎస్‌బీఐ అభ్యర్ధించింది.
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/HwIug1nEFB
— State Bank of India (@TheOfficialSBI) July 15, 2021
Also Read:
పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!
ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!