SBI Fixed Deposits: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. పెరిగిన వడ్డీ రేట్లు..!

|

Mar 12, 2022 | 6:14 PM

SBI Fixed Deposits: ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచగా, తాజాగా దేశీయ ప్రభుత్వ రంగ..

SBI Fixed Deposits: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. పెరిగిన వడ్డీ రేట్లు..!
Follow us on

SBI Fixed Deposits: ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచగా, తాజాగా దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ బల్క్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 20 బేసిస్‌ పాయింట్ల నుంచి 40 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. ఈ నెల 10 నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం.. 211 రోజుల కంటే అధిక డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ రేట్లు (Interest Rates) వర్తించనున్నట్లు తెలిపింది. ఇలాంటి ఎఫ్‌డీలపై 3.30 శాతం చొప్పున వడ్డీ లభించనుంది.

అయితే వడ్డీ పెరగకముందు ఇది 3.10 శాతంగా ఉంది. అలాగే సీనియర్‌ సిటిన్లకు 3.80 శాతం వడ్డీ ఆఫర్‌ చేస్తోంది. ఏడాది నుంచి 10 ఏళ్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 40 బేసిస్‌ పాయింట్లు సవరించింది. దీంతో వడ్డీరేటు 3.10 శాతం నుంచి 3.60 శాతానికి చేరింది. సీనియర్‌ సిటిజన్లకు 4.10 శాతం లభించనుంది. పెంచిన వడ్డీరేట్లు కొత్త డిపాజిట్లు, రెన్యూవల్స్‌ డిపాజిట్లకు వర్తించనుంది. అలాగే రెండు నుంచి మూడేళ్ల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటును 10 బేసిస్‌ పాయింట్లు సవరించింది. దీంతో వడ్డీ రేటు 5.20 శాతానికి చేరింది. అలాగే 3 నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 15 బేసిస్‌ పాయింట్లు సవరించడంతో 5.45 శాతానికి చేరింది. ఇక 5 నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటును కూడా 10 బేసిస్‌ పాయింట్లు సవరించడంతో వడ్డీ రేటు 5.50 శాతానికి చేరింది.

ఇవి కూడా చదవండి:

Petrol Diesel Price: లీటర్‌ పెట్రోల్‌ @254.. ఎక్కడో తెలుసా..?

Indian Coins: నాణెం మీద ఈ బొటనవేలు ముద్రకు అర్థం ఏమిటి?