Senior Citizen: సీనియర్ సిటిజన్‌ల కోసం ముగియనున్న ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌.. ఎప్పుడంటే..!

|

Sep 25, 2022 | 2:44 PM

Senior Citizen: రిజర్వ్ బ్యాంక్ అతి త్వరలో రెపో రేటును మళ్లీ పెంచబోతోంది. ఆ తర్వాత FD రేట్లు మరింత పెరుగుతాయి. ఇంతలో చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక..

Senior Citizen: సీనియర్ సిటిజన్‌ల కోసం ముగియనున్న ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌.. ఎప్పుడంటే..!
Senior Citizen Fd Scheme
Follow us on

Senior Citizen: రిజర్వ్ బ్యాంక్ అతి త్వరలో రెపో రేటును మళ్లీ పెంచబోతోంది. ఆ తర్వాత FD రేట్లు మరింత పెరుగుతాయి. ఇంతలో చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక FD పథకాన్ని ప్రారంభించాయి. వీటిపై సాధారణ ప్రజల కంటే ఎక్కువ వడ్డీని పొందుతున్నారు. అయితే ఇటువంటి FD పథకాలు తక్కువ కాలం లేదా నిర్ణీత కాలానికి మాత్రమే అమలు చేయబడుతున్నాయి. సీనియర్ సిటిజన్ కస్టమర్ ఈ నిర్ణీత వ్యవధిలో డబ్బును డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత అధిక రాబడి ప్రయోజనాన్ని పొందుతారు. మీరు అధిక వడ్డీ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే సీనియర్ సిటిజన్లు ఈ నిర్ణీత వ్యవధిలో పెట్టుబడి పెట్టాలి. అధిక వడ్డీ కోసం మీరు సెప్టెంబర్ 30 నాటికి ప్రత్యేక FD పథకంలో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే ఆ తర్వాత ఈ ప్లాన్ మూసివేయబడుతుంది.

HDFC బ్యాంక్, IDBI బ్యాంక్ ప్రత్యేక సీనియర్ సిటిజన్ FD పథకం 30 సెప్టెంబర్ 2022న ముగుస్తుంది. అదేవిధంగా గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డి పేరుతో ఐసిఐసిఐ బ్యాంక్ ప్రత్యేక సీనియర్ సిటిజన్ ఎఫ్‌డి పథకం అక్టోబర్ 7న ముగుస్తుంది. మరోవైపు, స్టేట్ బ్యాంక్ స్పెషల్ సీనియర్ ఎఫ్‌డి స్కీమ్ వ్యవధిని మార్చి 2023 వరకు పొడిగించింది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రకారం.. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మెచ్యూరిటీ ఉన్న ప్రత్యేక ఎఫ్‌డి పథకంలో రూ. 5 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్‌లకు 0.25 శాతం ప్రీమియం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ఇప్పటికే అందుబాటులో ఉన్న 0.50 శాతానికి అదనంగా ఉంటుంది. HDFC బ్యాంక్ ఈ ప్రత్యేక FD పథకం 18 మే 2020న ప్రారంభమైంది. 30 సెప్టెంబర్ 2022 వరకు అమలులో ఉంటుంది. ఈ కాలంలో తెరవబడిన కొత్త FDలు లేదా పాత FDలను పునరుద్ధరించడం వలన అదనపు వడ్డీ రేటు ప్రయోజనం పొందుతుంది.

ఇవి కూడా చదవండి

IDBI బ్యాంక్ నమన్ డిపాజిట్:

IDBI బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం నమన్ డిపాజిట్ స్కీమ్ పేరుతో ప్రత్యేక FD పథకాన్ని కూడా అమలు చేస్తుంది. ఈ డిపాజిట్ పథకంలో సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం వడ్డీ అందిస్తారు. IDBI బ్యాంక్ ఈ FD పథకం సెప్టెంబర్ 30, 2022 వరకు వర్తిస్తుంది.

ICICI బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ FD:

ఐసిఐసిఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డి పేరుతో పథకాన్ని అమలు చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వార్షిక వడ్డీపై 0.20 శాతం ఎక్కువ వడ్డీని ఇస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డి స్కీమ్ అక్టోబర్ 7, 2022 వరకు అమలు చేయబడుతోంది. దీనిలో కొత్త డిపాజిట్లపై, పాత ఎఫ్‌డిలను పునరుద్ధరించడంపై అధిక వడ్డీ ప్రయోజనం అందించబడుతుంది. అందువల్ల ఎక్కువ వడ్డీని పొందాలనుకునే సీనియర్ సిటిజన్లు అక్టోబర్ 7లోగా ఈ పథకంలో ఖాతాను తెరవాలి.

SBI వీకేర్ ప్రత్యేక పథకం

SBI సీనియర్ సిటిజన్ల కోసం WeCare ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. మే 2020లో ప్రారంభమైన ఈ పథకం కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించబడింది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఈ పథకం ప్రారంభించబడింది. అయితే వినియోగదారుల విపరీతమైన డిమాండ్ దృష్ట్యా దీని వ్యవధిని పొడిగించారు. రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్‌ల కోసం SBI వీకేర్ డిపాజిట్ ప్రవేశపెట్టబడింది. ఇందులో సీనియర్ సిటిజన్‌లకు వారి రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 5 సంవత్సరాల పాటు 30 బేసిస్ పాయింట్లు (ప్రస్తుతం ఉన్న 50 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువ) ప్రీమియం చెల్లించబడుతుంది. SBI వీకేర్ డిపాజిట్ పథకం మార్చి 31, 2023 వరకు పొడించింది బ్యాంకు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి