AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ఖాతాదారులకు అలర్ట్‌.. అమల్లోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్లు!

ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు షాకిచ్చింది. రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 444 రోజుల స్పెషల్ టెన్యూర్ డిపాజిట్ల వడ్డీ 7.05% నుండి 6.85%కి తగ్గింది. సీనియర్ సిటిజన్లకు 7.35% వడ్డీ లభిస్తుంది. ఈ మార్పులు మే 16, 2025 నుండి అమలులోకి వస్తాయి.

SBI ఖాతాదారులకు అలర్ట్‌.. అమల్లోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్లు!
Sbi
SN Pasha
|

Updated on: May 16, 2025 | 3:47 PM

Share

ఎస్‌బీఐ తమ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. పబ్లిక్ సెక్టార్‌లో అతిపెద్ద బ్యాంక్ అయితే ఎస్‌బీఐలో కోట్లాది మంది ఖాతా కలిగి ఉన్నారు. ఎస్‌బీఐలో కోట్లాది రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల రూపంలో వస్తుంటాయి. అయితే వీటిపై ఇంతకాలం మంచి వడ్డీ రేట్లు కల్పించింది స్టేట్‌ బ్యాంక్‌ ఇప్పుడు కస్టమర్లకు ఊహించని షాకిచ్చింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేసింది. ఆర్బీఐ గత రెండు ద్వైమాసిక సమీక్షా సమావేశల్లో రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. దీంతో ఎస్‌బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించింది అయితే ఈ వడ్డీ రేట్ల తగ్గింపు డిపాజిటర్లకు బ్యాడ్‌ న్యూస్ అయితే లోన్లు తీసుకునేవారికి మాత్రం గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి.

అన్ని రకాల మెచ్యూరిటీ టెన్యూర్ల డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటులో తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ తాజాగా ప్రకటించింది. 444 రోజుల స్పెషల్ టెన్యూర్ డిపాజిట్లకూ ఈ వడ్డీ రేటు తగ్గింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. సవరించిన వడ్డీ రేట్లు నేటి (మే 16, 2025 శుక్రవారం) నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. వడ్డీ రేట్ల సవరణ తర్వాత 444 రోజుల స్పెషల్ టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం వడ్డీ రేటు 7.05 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గింది. ఇది 60 ఏళ్లలోపు వయసు గల జనరల్ కస్టమర్లకు వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే 444 రోజుల పథకం ద్వారా సీనియర్లకు 7.35 శాతం వడ్డీ లభించనుంది.

సవరించిన కొత్త వడ్డీ రేట్లు రూ.3 కోట్ల లోపు ఉండే రిటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. రూ.3 కోట్ల లోపు ఉండే డిపాజిట్లను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. వాటికి వడ్డీ రేట్లు వేరుగా ఉంటాయి. మరోవైపు ఎస్‌బీఐ ఉద్యోగులకు మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏకంగా 100 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ కల్పిస్తోంది. కార్డు రేటుపై 100 బేసిస్ పాయింట్ల వడ్డీ ఎక్కువొస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన తర్వాత డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎస్‌బీఐ తగ్గించడం ఇది రెండోసారి. వరుసగా రెండు సమావేశాల్లో కలిపి 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. రానున్న కాలంలో మరో 2-3 సార్లు వడ్డీ రేట్ల తగ్గించే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిమ్మకాయ నీళ్లు తాగితే బీపీ తగ్గుతుందా.. అసలు వాస్తవం ఏంటీ..?
నిమ్మకాయ నీళ్లు తాగితే బీపీ తగ్గుతుందా.. అసలు వాస్తవం ఏంటీ..?
ఈ ఏడాది హయ్యెస్ట్ వ్యూస్‌తో ఓటీటీని షేక్ చేసిన వెబ్ సిరీస్ ఇదే
ఈ ఏడాది హయ్యెస్ట్ వ్యూస్‌తో ఓటీటీని షేక్ చేసిన వెబ్ సిరీస్ ఇదే
వైభవ్ సూర్యవంశీని మించిన విధ్వంసం భయ్యో.. 32 బంతుల్లో సెంచరీ
వైభవ్ సూర్యవంశీని మించిన విధ్వంసం భయ్యో.. 32 బంతుల్లో సెంచరీ
బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!