AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..

వరుసగా నాలుగు రోజుల పాటు ఎస్బీఐ బ్యాంకులు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఎస్బీఐ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నాయి. ఈ కారణంతో బ్యాంకులు మూతపడనున్నాయి. రెండు రోజులు సమ్మె కారణంగా మూసివేయనుండగా.. మరో రెండు రోజులు సాధారణ సెలవులు వచ్చాయి. దీంతో కస్టమర్లు ఇబ్బందులు పడనున్నారు.

SBI: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
ఒక వ్యక్తి ఏదైనా నిర్దిష్ట ఎస్‌బిఐ ఎఫ్‌డి పథకంలో రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో వారు సుమారుగా రూ.1,58,974 స్థిర వడ్డీని సంపాదించవచ్చు. అందుకే సురక్షితమైన పెట్టుబడులు, హామీతో కూడిన ఆదాయం కోరుకునే వారు ఎస్‌బిఐ ఎఫ్‌డిలను ఒక నమ్మకమైన ఎంపికగా పరిగణిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వినియోగదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDల)పై అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ బ్యాంకు వివిధ కాలపరిమితుల FD పథకాలపై కనిష్టంగా 3.05 శాతం నుండి గరిష్టంగా 7.15 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఎస్‌బీఐ అతి తక్కువ కాలపరిమితి గల FD, అంటే 7 రోజుల FD, వినియోగదారులకు 3.05% నుండి 3.65% వరకు వడ్డీ రేటును అందిస్తుంది.
Venkatrao Lella
|

Updated on: May 20, 2026 | 5:24 PM

Share

ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దేశంలోనే అతి పెద్ద ప్రముఖ రంగ బ్యాంకుగా ఎస్బీఐకి పేరుంది. ఎక్కువమంది కస్టమర్లు కలిగి ఉన్న బ్యాంకుగా కొనసాగుతోంది. దీంతో ఎస్బీఐ బ్యాంకులు మూతపడనుండటంతో కోట్లాది మంది ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఈ బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు సమ్మె చేపట్టనుండగా.. సాధారణ సెలవులు రావడంతో వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి.

రెండు రోజుల పాటు సమ్మె

మే 25 నుంచి 26వ తేదీ వరకు రెండు రోజుల పాటు ఎస్బీఐ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నారు. పని వాతావరణం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ వంటి డిమాండ్లతో సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. వర్క్‌మెన్ కేటగిరీలోని ఉద్యోగులు 2 రోజుల పాటు సమ్మెలో పాల్గొననున్నారు. ప్రస్తుతం సిబ్బంది కొరత ఉన్నా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సిబ్బందిని నియమించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బ్రాంచులు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతోనే నడుస్తున్నాయి. 1990 నుంచి శాశ్వత నియామకాలు జరగడం లేదు. దీంతో మెసెంజర్స్, సెక్యూరిటీ గార్డులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పెన్షన్లు, నియామకాలు, సర్వీసులు వంటి 16 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.

వరుసగా నాలుగు రోజులు బంద్

మే 25న, మే 26వ తేదీల్లో సమ్మె చేపట్టనుండగా.. మే 23న నాలుగో శనివారం, మే 24న ఆదివారం సాధారణ సెలవు దినం వస్తోంది. దీంతో బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు బంద్ కానున్నాయి. దీంతో ఈ నెల చివరి వారంలో ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లకు అంతరాయం కలగనుంది. అయితే బ్రాంచ్ కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోతాయి. ఏటీఎం, యూపీఐ సర్వీసులు వంటివి యధాతధంగా పనిచేస్తాయి. పేపర్ వర్క్, డ్రాఫ్ట్ వర్కస్ వంటి నిలిచిపోతాయి.

Follow Us