SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌… జూలై 1 నుంచి అమ‌ల్లోకి కొత్త ఛార్జీలు.. ఏటీఎం ట్రాన్సాక్ష‌న్స్‌పై..

|

May 25, 2021 | 9:17 PM

SBI Alert: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌బీఐ) ఖాతా ఉందా.. అయితే ఈ వార్త మీకోస‌మే. ఎస్‌బీఐ తాజాగా బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాదారుల‌కు విధించే సేవా ఛార్జీలను సవరించింది...

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌... జూలై 1 నుంచి అమ‌ల్లోకి కొత్త ఛార్జీలు.. ఏటీఎం ట్రాన్సాక్ష‌న్స్‌పై..
ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బేసిక్ సేవింగ్స్ ఎకౌంటు హోల్డర్లకు జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు చేసేందుకు సిద్దమైంది. అటు క్యాష్ విత్ డ్రాయల్, చెక్ బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు కొత్త ఛార్జీలు అమ‌ల్లోకి రానున్నాయి.
Follow us on

SBI Alert: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌బీఐ) ఖాతా ఉందా.. అయితే ఈ వార్త మీకోస‌మే. ఎస్‌బీఐ తాజాగా బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాదారుల‌కు విధించే సేవా ఛార్జీలను సవరించింది. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడం, చెక్‌బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమ‌ల్లోకి రానున్నాయి. ఈ విష‌యాన్ని ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో క‌నీస నిల్వ (మినిమం బ్యాలెన్స్‌) ఉండాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఇత‌ర అకౌంట్లలో అయితే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. ఒకవేల మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందనే విష‌యం తెలిసిందే. ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుంది. నెలలో నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ చార్జీలు జూలై 1 నుంచి మార‌నున్నాయి. ఫ‌స్ట్ నుంచి కొత్త స‌ర్వీస్ ఛార్జీ రూ. 15తో పాటు జీఎస్టీ వ‌ర్తిస్తుంది.

పెర‌గ‌నున్న చెక్ బుక్ ఛార్జీలు..

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో 10 చెక్స్‌తో కూడిన బుక్‌ను ఉచితంగా అందిస్తారు. ఆ త‌ర్వాత బుక్ కావాలంటే పెరిగిన ఛార్జీల‌తో రూ.40+జీఎస్‌టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+జీఎస్‌టీ చెల్లించాలి. 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి.

Also Read: Telangana Corona Cases Updates: తెలంగాణలో 3,821 పాజిటివ్ కేసులు నమోదు.. 23 మంది మృతి..

Gold River: నది ఒడ్డున పసిడి బురద..తీసుకున్నోళ్ళకి తీసుకున్నంత బంగారం..అదే వారి జీవనాధారం..ఎక్కడంటే..

Yaas Cyclone: అతి తీవ్ర తుపానుగా మార‌నున్న ‘యాస్’.. ఏపీలో ప‌లు చోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్‌..