పండుగల సీజన్ వచ్చిందంటే క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులకు నిజంగా పండుగే. అన్ని ప్లాట్ ఫారంలపై అద్భుతమైన ఆఫర్లు, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు ఉంటాయి. అన్ని రంగాలలోనూ కార్డులపై పలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాగే బ్యాంకులు కూడా తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు పలు ఆఫర్లను అందిస్తుంటాయి. దేశంలోని ప్రధాన రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ విషయంలో ముందజలో ఉంటుంది. ఎప్పుడూ పండుగల సమయంలో ఎస్బీఐ కార్డులపై పలు ఆఫర్లను అందిస్తుంటుంది. ఇదే క్రమంలో ఎస్బీఐ తన కార్డు వినియోగదారులకు ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్ లో కూడా అదిరే డిస్కౌంట్లు ప్రకటించింది. అన్ని రకాల వస్తువులపై ఏకంగా 27.5శాతం వరకూ వివిధ రూపాల్లో ఆఫర్లు అందిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఆ ఆఫర్లు ఏంటి? ఆ ఆఫర్లు దేనిలో ఉన్నాయి. తెలుసుకుందాం రండి..
అన్ని రకాల వస్తువుల కొనుగోలుపైనా ఆఫర్లను అందిస్తోంది ఎస్బీఐ కార్డ్. మొబైల్స్, ల్యాప్ టాప్ లు, ఫ్యాషన్, ఫర్నిచర్, ఆభరణాలు, కిరాణా వంటి విభిన్న రకాల వస్తువలపై ఈ ఆఫర్లు ఉన్నాయి. గరిష్టంగా 27.5శాతం వరకూ క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు లభిస్తాయి. ఎస్బీఐ కార్డు అన్ని బ్రాండ్లతో ఈఎంఐ ఆధారిత ఆఫర్లను అందిస్తోంది. దీని సాయంతో కార్డు వినియోగదారులకు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయవచ్చని కంపెనీ ప్రకటించింది.
ఎస్బీఐ కార్డ్ కస్టమర్‌లకు ఫెస్టివ్ ఆఫర్ 2023లో భాగంగా 600పైగా జాతీయ స్థాయి ఆఫర్లు, అలాగే 1,500 కంటే ఎక్కువగా ప్రాంతీయ, హైపర్‌లోకల్ ఆఫర్‌లను అందిస్తోంది. నవంబర్ 15వరకు ఈ ఆఫర్లు చెల్లుబాటులో ఉంటాయని బ్యాంక్ ప్రకటించింది. ఈ పండుగ ఆఫర్‌లో భాగంగా, 2,700 నగరాల్లోని ఎస్బీఐ కార్డ్ కస్టమర్‌లు గరిష్టంగా ప్రయోజనం పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మింత్రా, రిలయన్స్ రిటైల్ గ్రూప్, వెస్ట్ సైడ్, ప్యాంటలూన్స్, మ్యాక్స్, టానిష్క్, టీబీజెడ్ వంటి వివిధ ప్లాట్ ఫారంలలో పలు బ్రాండ్ లపై ఏకంగా 27.5శాతం వరకూ తగ్గింపు, క్యాష్ బ్యాక్ రూపేణా పొందవచ్చు.
ఎస్బీఐ కార్డ్ ఈఎంఐ ఆధారిత ఆఫర్లను ఎక్కువగా అందిస్తోంది. ముఖ్యంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, మొబైల్, ల్యాప్‌టాప్ విభాగాలలో ని వివిధ బ్రాండ్‌లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా శామ్సంగ్, ఎల్జీ, సోనీ, ఒప్పో, వివో, ప్యానసోనిక్, వర్ల్ పూల్, బోస్చ్, ఐఎఫ్బీ, హెచ్‌పీ, డెల్ వంటి టాప్ బ్రాండ్లు ఉన్నాయి. వీటిల్లో మీరు కొనుగోలు చేసే వస్తువులపై ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే తగ్గింపు లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..