SBI ATM: మీరు ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్తున్నారా..? మీ మొబైల్‌ను వెంట ఉంచుకోండి.. ఎందుకంటే..!

|

Nov 07, 2021 | 6:02 AM

SBI ATM: ప్రస్తుతం ఆన్‌లైన్‌ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకుని కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. అలాగే ఏటీఎంల వద్ద..

SBI ATM: మీరు ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్తున్నారా..? మీ మొబైల్‌ను వెంట ఉంచుకోండి.. ఎందుకంటే..!
Follow us on

SBI ATM: ప్రస్తుతం ఆన్‌లైన్‌ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకుని కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. అలాగే ఏటీఎంల వద్ద కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఏటీఎంల వద్ద మోసాలను నివారించేందుకు ఎస్‌బీఐ ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా ఏటీఎంల వద్ద జరిగే మోసాలను అరికట్టవచ్చని చెబుతోంది. దీంతో ఖాతాదారుడికి ఈ విధానం రక్షణంగా ఉంటుందని చెబుతోంది. ఏటీఎంలలో రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే డెబిట్‌కార్డుతో పాటు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అందుకు మీ ఖాతాకు ఏ మొబైల్‌ నెంబర్‌ ఉందో ఆ ఫోన్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ విధానం ద్వారా ఖాతాదారుడు మోసగాళ్ల నుంచి రక్షించుకోవచ్చు. ఈ మేరకు ఎస్‌బీఐ అధికారిక ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. అయితే ఈ విధానం కేవలం ఎస్‌బీఐ ఏటీఎంల వద్ద మాత్రమే ఉంది.

ఈ విధానం ఎస్‌బీఐ ఏటీఎంల వద్ద నగదు విత్‌డ్రా చేసేందుకు ఓటీపీ అవసరం ఉంటుంది. ఖాతాదారుడు బ్యాంకు వద్ద రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఒకసారి వచ్చిన ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే వర్తిస్తుంది. ఏటీఎంలో కార్డు ఇన్‌సర్ట్‌ చేసి, డెబిట్‌ కార్డు పిన్‌ నెంబర్‌, విత్‌డ్రా చేసే నగదు మొత్తాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్‌ చేయాలని అడుగుతుంది. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాలి. ఓటీపీ ఎంటర్‌ చేస్తేనే మీకు ఏటీఎం నుంచి క్యాష్‌ వస్తుంది.

ఇలా ఎస్‌బీఐ తన కస్టమర్ల భద్రత కోసం ఎప్పటికప్పుడ చర్యలు చేపడుతోంది. ఈ మధ్యకాలంలో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కొత్త ఓటీపీ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఎస్‌బీఐ.

 

ఇవి కూడా చదవండి:

PM Modi: ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి పెరిగిన మరింత క్రేజ్‌.. తాజా సర్వేలో ఆ వివరాలు..

Bank Loan: బ్యాంకు లోన్ కావాలనుకుంటున్నారా…? తక్కువ వడ్డీకే రుణాలు అందించే బ్యాంకులు ఇవే..!