Saudi Arabia: అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన సౌదీ అరేబియా.. కానీ ఆ ఐదు రోజులు..

|

Nov 26, 2021 | 8:22 AM

సౌదీ అరేబియా భారతదేశంతో సహా ఆరు దేశాల నుండి వచ్చే వ్యక్తులపై ఆంక్షలు ఎత్తివేసింది. భారత్‌తో పాటు పాకిస్తాన్, బ్రెజిల్, వియత్నాం, ఈజిప్ట్, ఇండోనేషియా నుంచి వచ్చే ప్రయాణికులను డిసెంబర్ 1 నుంచి నేరుగా దేశంలోకి అనుమతించనున్నట్లు స్థానిక నివేదికలు తెలిపాయి...

Saudi Arabia: అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన సౌదీ అరేబియా.. కానీ ఆ ఐదు రోజులు..
Soudhi
Follow us on

సౌదీ అరేబియా భారతదేశంతో సహా ఆరు దేశాల నుండి వచ్చే వ్యక్తులపై ఆంక్షలు ఎత్తివేసింది. భారత్‌తో పాటు పాకిస్తాన్, బ్రెజిల్, వియత్నాం, ఈజిప్ట్, ఇండోనేషియా నుంచి వచ్చే ప్రయాణికులను డిసెంబర్ 1 నుంచి నేరుగా దేశంలోకి అనుమతించనున్నట్లు స్థానిక నివేదికలు తెలిపాయి. సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ దేశాల నుండి పూర్తిగా వ్యాక్సిన్ పొందిన ప్రవాసులకు సౌదీ అరేబియాలోకి రావడానికి వారి దేశాల వెలుపల రవాణాలో 14 రోజులు గడపవలసిన అవసరం లేకుండా నేరుగా ప్రవేశించడానికి అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వారు ఐదు రోజులు నిర్బంధంలో గడపాల్సి ఉంటుంది. దేశానికి తిరిగి రావాలని ఆశించే ప్రవాసులు వారు ఇన్‌ఫెక్షన్ నుండి విముక్తి పొందారని నిర్ధారించుకోవడానికి అన్ని పరీక్షలు చేయించుకోవాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో, COVID-19 మహమ్మారి వ్యాప్తిని పెరగడంతో ఈ ఆరు దేశాల నుంచే వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించారు. లెబనాన్, యూఏఈ, ఈజిప్ట్, టర్కీ, యుఎస్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఐర్లాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, స్వీడన్, బ్రెజిల్, అర్జెంటీనా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇండియా, ఇండోనేషియా, జపాన్‌ నుంచి వచ్చ ప్రయాణికులపై నిషేధం విధించారు. అయితే దౌత్యవేత్తలు, వైద్య సిబ్బంది, వారి కుటుంబాలు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా సౌదీ అరేబియా 2020 మార్చి 14న తమ దేశానికి వచ్చే విమానాలను నిలిపివేసింది. తిరిగి జనవరి 3, 2021న విమానం, రోడ్డు, సముద్ర మార్గం ద్వారా వచ్చే వారిని ఆంక్షలతో అనుమతించింది.

Read Also.. Silver Price Today: పెరిగిన వెండి ధర.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!