Samsung: కస్టమర్ల కోసం సామ్‌సంగ్‌ సంచలన నిర్ణయం.. ఆ ఉత్పత్తులపై ఏకంగా 20 ఏళ్ల వారంటీ..

|

Dec 03, 2022 | 8:55 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. సౌత్‌ కొరియాకు చెందిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మంచి బ్రాండింగ్‌ను సంపాదించుకుంది. స్మార్ట్ ఫోన్‌లు మొదలు ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మిషిన్ల వరకు..

Samsung: కస్టమర్ల కోసం సామ్‌సంగ్‌ సంచలన నిర్ణయం.. ఆ ఉత్పత్తులపై ఏకంగా 20 ఏళ్ల వారంటీ..
Samsung
Follow us on

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. సౌత్‌ కొరియాకు చెందిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మంచి బ్రాండింగ్‌ను సంపాదించుకుంది. స్మార్ట్ ఫోన్‌లు మొదలు ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మిషిన్ల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌కు సామ్‌సంగ్ పెట్టింది పేరు. ఇదిలా ఉంటే తాజాగా సామ్‌సంగ్‌ కస్టమర్లను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే తాజాగా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అమ్మకాలు మరింత పెంచుకునే క్రమంలోనే వారంటీ కాలాన్ని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 5 నుంచి 10 ఏళ్ల వారంటీని అందిస్తారు. అయితే సామ్‌సంగ్ వారంటీని ఏకంగా 20 ఏళ్లకు పెంచింది. వాషింగ్ మెషీన్లలో ఉపయోగించే డిజిటల్ ఇన్వర్టర్ మోటార్, రిఫ్రిజిరేటర్లలో ఉపయోగించే డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌పై 20 సంవత్సరాల వారంటీని అందించనున్నట్లు సామ్‌సంగ్ తెలిపింది. తమ ఉత్పత్తులపై వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచడానికి, అలాగే పెరిగిపోతున్న ఇ-వ్యర్థాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇక ఈ విషయమై సామ్‌సంగ్‌ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. అత్యాధునిక డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్, డిజిటల్ ఇన్వర్టర్ మోటార్‌లను రూపొందిస్తున్నామని, నాణ్యత విషయంలో ఎలాంటి కాంప్రమైజ్‌ పడడం లేదని తెలిపారు. సామ్‌సంగ్‌ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం కారణంగా తమ కంపెనీలు అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని సామ్‌సంగ్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..