సాధారణంగా జీతం, పెన్షన్ డబ్బులు బ్యాంకుల పనిదినాల్లోనే అకౌంట్లలోకి పడుతుంటాయి. అయితే అప్పుడప్పుడూ ఒకటో తేదీ వారాంతంలో రావడంతో ప్రజలందరూ బ్యాంక్ పనిదినం వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అటు ఈఎంఐలు, బిల్లులు, ఇతరత్రా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌కు సైతం చెల్లింపులు చేయాలంటే బ్యాంకుల పనిదినాల వరకు వేచి చూడాల్సిందే.
అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఇకపై సెలవు రోజుల్లోనూ సాలరీ, పెన్షన్ డబ్బులు పడేలా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ఆగష్టు 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని కీలక ప్రకటన చేసింది.
దీనితో ఇకపై ప్రతీనెలా ఒకటో తారీఖున జీతాలు పడటం, పెన్షన్ డబ్బులు, వడ్డీ, ఈఎంఐలు, ఇతరత్రా బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ లాంటివి అన్నీ కూడా జమ/కట్ కానున్నాయి. బ్యాంకులు తెరిచి ఉన్నప్పుడు, వారానికి ఏడు రోజులు ఎన్ఏసీహెచ్ సేవలు ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి.
కాగా, గతంలో క్రెడిట్ పాలసీ సమీక్షను నిర్వహించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్‌టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలను 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్ఏసీహెచ్ సేవలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) నిర్వహిస్తోంది.
Also Read:
రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!
జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!
ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!