Safest Cars: ఈ కార్లు యాక్సిడెంట్ అవ్వకుండా ఆపుతాయని తెలుసా? ఇండియాలో ఈ ఫీచర్ ఉన్న కార్లు ఇవే..

ఇప్పుడొస్తున్న కార్లలో చాలా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉంటున్నాయి. ఎయిర్ బ్యా్గ్స్, గ్లోబల్ సేఫ్టీ రేటింగ్స్‌తో పాటు యాక్సిడెంట్ అవ్వకుండా అడ్డుకునే లేటెస్ట్ టెక్నాలజీ కూడా కొన్ని కార్లలో అందుబాటులో ఉంది. అసలు ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది. ఈ ఫీచర్ ఉన్న కార్లు ఏవి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Safest Cars: ఈ కార్లు యాక్సిడెంట్ అవ్వకుండా ఆపుతాయని తెలుసా? ఇండియాలో ఈ ఫీచర్ ఉన్న కార్లు ఇవే..
Safest Cars

Updated on: Oct 29, 2025 | 1:48 PM

ఈ రోజుల్లో చాలామంది  కారు కొనేటప్పుడు డిజైన్, మైలేజ్, బిల్డ్ క్వాలిటీతోపాటు సేఫ్టీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సేఫ్టీ అంటే కేవలం గ్లోబల్ సేఫ్టీ ర్యాంకింగ్ ఒక్కటే కాదు, కారులో ఉండే చాలా ఫీచర్లు సేఫ్టీని డిసైడ్ చేస్తాయి. ఉదాహరణకు బ్రేకింగ్ వ్యవస్థ, ఎయిర్ బ్యాగులు, ట్రాక్షన్ కంట్రోల్.. ఇలా సేఫ్టీకి సంబంధించి చాలా ఫీచర్లు ఉన్నాయి. అయితే వీటీతో పాటుగా రీసెంట్ గా వస్తున్న కార్లలో  అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) అనే కొత్త టెక్నాలజీ వస్తోంది. ఈ ఫీచర్ కారుకి యాక్సిడెంట్ అవ్వకుండా ఉండేందుకు సాయపడతుంది. ఇదెలా పనిచేస్తుందంటే..

ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..

అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అనేది సెన్సర్ ద్వారా రోడ్డుపై ఉండే ఇతర వాహనాలను గమనించి డ్రైవర్ కు సంకేతం ఇస్తుంది. ఒకవేళ కారు ఏదైనా వాహనానికి లేదా డివైడర్ కి దగ్గరగా వెళ్తుంటే వెంటనే డ్రైవర్ ను అలెర్ట్ చేస్తుంది. ఒకవేళ కారు మరో వాహనాన్ని తగిలేంత దగ్గరగా వెళ్లినప్పుడు ఆటోమేటిక్ గా స్లో చేసి ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ఫీచర్ ఉన్న కొన్ని కార్లు ఇవే..

మహీంద్రా XUV 3XO

మహీంద్రా XUV 3XOకు సంబంధించిన  AX5 L వేరియంట్‌లో ఈ  ADAS టెక్నాలజీ ఫీచర్ ఉంది. అటానమస్ ఎమర్జన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ముఖ్యమైన ఫీచర్లతో వస్తుంది. దీని ధర రూ.11.50 లక్షలు ఉంటుంది.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్‌ (Tata Nexon)లోని  ఫియర్‌లెస్ ప్లస్ వేరియంట్‌లో ADAS ఫీచర్‌ ఉంది. ఇందులో కూడా అటానమస్ ఎమర్జన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ సెంటరింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 13.53 లక్షలు ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ(Hyundai Venue)లో కూడా బేసిక్  ADAS ఫీచర్ ఉంది. అంటే ఇది స్టీరింగ్, బ్రేకింగ్, యాక్సలరేషన్ వంటి విషయాల్లో డ్రైవర్ కు సాయం చేస్తుంది. దీని ధర రూ. 11.49 లక్షలు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.