PM Kisan Scheme: యావత్ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో రైతులకు శుభవార్త. అన్నదాతల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రానున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నాయి. దీంతో రైతన్నల అకౌంట్లోకి ఒకేసారి రూ.7,500 వచ్చి చేరనున్నాయి. ఇది రైతులకు ప్రయోజనం కలిగించే వార్త అని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా స్కీం కింద రూ.5,500 డబ్బులను కూడా రైతు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. మే 13న ఈ డబ్బులు అన్నదాతల అకౌంట్లోకి రావొచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం.. రైతులకు భరోస ఇచ్చేందుకు చేపట్టిన పీఎం కిసాన్ స్కీం కింద రూ.2 వేలను రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. Rythu Bharosa
మే 2 తర్వాత నుంచి పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రైతుల అకౌంట్లోకి రావొచ్చని పలు నివేదికలు వెలువడుతున్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే మొత్తం డబ్బు రూ.7,500 దాదాపు అటు ఇటుగా ఒకేసారి బ్యాంక్ అకౌంట్లోకి రానున్నాయి. rythu bharosa pm kisan money ఒకవేళ పీఎం కిసాన్ పథకంలో చేరకపోతే సాధ్యమైనంత త్వరగా చేరండి. ఆన్ లైన్ ద్వారా సులభంగానే పీఎం కిసాన్ స్కీమ్ పథకంలో చేరొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సరిపోతుంది. సులభంగానే పీఎం కిసాన్ పథకంలో చేరిపోవచ్చు.