
ఇంటి పనులన్నీ చేసుకుంటూ.. ఒక కుటుంబ బాధ్యతను మొత్తం తన భుజాలపై వేసుకొని మోసే చాలా మంది మహిళలకు తమకంటూ ఆర్థిక స్వతంత్రం ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ఇంటి దగ్గర ఏదైనా మంచి చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలని అనుకుంటారు. సిటీలో అంటే ఏదో ఒక చిన్న బిజినెస్ లాంటిది పెట్టుకోవచ్చు. బట్.. పల్లెటూర్లలో ఉండే మహిళలకు అన్ని ఆప్షన్స్ ఉండవు. కానీ, ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. మహిళలు రెడీ అవ్వడంలో సిటీ వారికి, ఊర్లో ఉండేవారికి పెద్దగా తేడా ఏం ఉండటం లేదు. ఇప్పుడు ఇదే ధోరణిని బిజినెస్ ఐడియాగా మార్చుకోవచ్చు.
అదే ఫ్యాన్సీ షాప్. ఊర్లోనే ఇంట్లోనే ఒక పక్కకు మంచిగా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని పెట్టేసుకొని.. ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఆ వ్యాపారం చేయవచ్చు. లేదా ఇంటి పనుల్లో ఉండగా ఎవరైనా కస్టమర్స్ వస్తే కాసేపు పని ఆపి అయినా కూడా వ్యాపారం చేయవచ్చు. ప్రస్తుతం అంతా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఫంక్షన్ అయినా అందంగా రెడీ అవ్వాలని అనుకుంటున్నారు. అందుకోసం ఫ్యాన్సీ ఐటమ్స్‌పై ఎక్కువ ఆధారపడుతున్నారు. బంగారు నగలు ఉన్నా కూడా ప్రతిసారీ అవే ధరించడానికి ఇష్టపడటం లేదు. డ్రెస్ కలర్‌కు మ్యాచ్ అయ్యేలా నెక్లెస్, గాజులు, ఇయర్ రింగ్స్ ఇలా ప్రతి ఒక్కటి కొత్తది తీసుకోవాలని అనుకుంటున్నారు. ధర తక్కువ పైగా కొత్త లుక్ ఇస్తున్నాయి కాబట్టి ఫ్యాన్సీ ఐటమ్స్‌కు మంచి డిమాండ్ ఉంది.
అందుకే ఈ బిజినెస్‌ను మహిళలు ఇంట్లోనే స్టార్ట్ చేయవచ్చు. జట్టు రూ.10 నుంచి రూ.20 వేల పెట్టుబడితో సరుకు తెప్పించుకొని.. తమ చుట్టు పక్కల వారికి, వారి ద్వారా ఊరంతా తెలిసేలా చేసుకొని మంచి ఆదాయం పొందవచ్చు. దీని కోసం పెద్దగా స్కిల్స్ కూడా ఏం అవరసం లేదు. కస్టమర్స్‌ను ఆకట్టుకునేలా.. ఈ వస్తువు మీకు బాగా నప్పుతుందని నాలుగు మాటలు చెప్పడం వస్తే చాలు. ఒకటి కొనేందుకు వచ్చిన వారితో నాలుగు రకాల వస్తువుల కొనిపించవచ్చు. పైగా ఇందులో మార్జిన్స్ భారీగా ఉంటాయి. రూ.2 వస్తువును రూ.10, రూ.20 లకు కూడా అమ్మొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే.. ఈ బిజినెస్ మొదలుపెట్టేయండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి