AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: వార్షిక, ప్రాసెసింగ్‌ ఛార్జీలు లేకుండా కొత్త క్రెడిట్‌ కార్డు.. ఎలా తీసుకోవాలి..? పూర్తి వివరాలు

Credit Card: ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించి కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేసింది. ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి..

Credit Card: వార్షిక, ప్రాసెసింగ్‌ ఛార్జీలు లేకుండా కొత్త క్రెడిట్‌ కార్డు.. ఎలా తీసుకోవాలి..? పూర్తి వివరాలు
Subhash Goud
|

Updated on: May 08, 2022 | 8:20 AM

Share

Credit Card: ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించి కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేసింది. ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి ఫిన్‌టెక్ కంపెనీలను అనుమతించలేదు. అయితే బ్యాంకులతో టై-అప్‌ల సహాయంతో క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించవచ్చు. అదే తరహాలో ఫిన్‌టెక్ కంపెనీ రూపేక్ (Rupeek)సెక్యూర్డ్ కార్డ్ అయిన క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసింది. సాధారణంగా అన్ని క్రెడిట్ కార్డ్‌లు ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. ఈ కార్డ్ పేరు రూపేక్ ప్రైమ్ అని పేరు పేట్టారు. మీరు కంపెనీ వద్ద బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు మాత్రమే ఇది జారీ చేయబడుతుంది. అందుకే దీనిని గోల్డ్ కార్డ్ అని కూడా పిలుస్తారు. రూపేక్ క్రెడిట్ కార్డ్ సురక్షిత కార్డ్. ఇందులో ఖాతాదారుడు ఆభరణాలు, బంగారం తాకట్టు పెట్టాలి. క్రెడిట్ కార్డ్ పరిమితి మీ హోల్డింగ్ విలువలో 75% వరకు ఉంటుంది. క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు కంపెనీ RBL బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది.ఈ కార్డ్ గరిష్ట పరిమితి 50 లక్షల రూపాయలు వరకు ఉంటుంది.

మొత్తం పరిమితిని నగదు రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ కార్డ్ కోసం వడ్డీ రహిత వ్యవధి 37-45 రోజులు ఉంటుంది. అయితే సకాలంలో చెల్లింపు చేయకపోతే సాధారణ క్రెడిట్ కార్డ్ లాగా దానిపై వడ్డీ కూడా వసూలు చేయబడుతుంది. వడ్డీ లేని కాలం తర్వాత కంపెనీ వార్షికంగా 30 శాతం అంటే నెలవారీ 2.5 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. విశేషమేమిటంటే క్రెడిట్ కార్డ్ హోల్డర్ మొత్తం పరిమితిని కూడా నగదు రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి 1% ప్రాసెసింగ్ ఫీజు ఉంది. ఇతర క్రెడిట్ కార్డ్‌లకు, ఈ రుసుము చాలా ఎక్కువగా ఉంటుంది.

పరిమిత నగరాల్లో ఈ కార్డ్

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం, ఈ కార్డ్ సౌకర్యం భారతదేశంలోని పరిమిత నగరాల్లో అందుబాటులో ఉంది. ఇది హైదరాబాద్, ముంబై, పూణే, చెన్నై, కోల్‌కతా, జైపూర్, రాజ్‌కోట్, వడోదర, చండీగఢ్, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు వంటి నగరాల్లో అందుబాటులో ఉంది. కార్డ్‌ని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రెండింటిలోనూ ఉపయోగించవచ్చు. ఈ కార్డు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యం కూడా ఉంది. కార్డ్ భౌతిక మరియు వర్చువల్ రూపంలో అందుబాటులో ఉంది.

దరఖాస్తు రుసుములు, వార్షిక ఛార్జీలు లేవు

కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ సింఘాల్‌ మాట్లాడుతూ.. ఉద్యోగం చేసేవారు లేదా రిటైరైన వారు, బంగారం కలిగి ఉన్నవారు ఈ కార్డును ఇష్టపడుతున్నారని తెలిపారు. ఈ కార్డ్ అత్యవసర నిధిగా ఉపయోగించబడుతుంది. ఇది క్రెడిట్ కార్డ్ లాగానే పని చేస్తుంది. ఈ కార్డ్ కోసం దరఖాస్తు రుసుము లేదు. ఇది కాకుండా, ఏ రకమైన వార్షిక ఛార్జీ వసూలు చేయడం లేదని తె లిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Nitin Gadkari: దేశంలో భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. వచ్చే రెండేళ్లలో ఎన్నంటే..?

India Post Payments Bank: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ డోర్‌స్టెప్‌ సేవలు.. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోండిలా..!