Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లోకి రూ.26,806 కోట్ల పెట్టుబడులు.. కంపెనీ విలువ రూ.2.8 లక్షల కోట్లు

| Edited By: Subhash Goud

Jul 13, 2021 | 10:35 PM

Flipkart: భారత్‌లో వాల్‌మార్ట్‌ అనుబంధ ఈ-కామర్స్‌ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్‌’ తాజాగా 360 కోట్ల డాలర్ల (సుమారు రూ.26,806 కోట్లు) భారీ పెట్టుబడులు సమీరించింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌..

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లోకి రూ.26,806 కోట్ల పెట్టుబడులు.. కంపెనీ విలువ రూ.2.8 లక్షల కోట్లు
Follow us on

Flipkart: భారత్‌లో వాల్‌మార్ట్‌ అనుబంధ ఈ-కామర్స్‌ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్‌’ తాజాగా 360 కోట్ల డాలర్ల (సుమారు రూ.26,806 కోట్లు) భారీ పెట్టుబడులు సమీకరించింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌ విలువ 3,760 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2.8 లక్షల కోట్లు) చేరింది. సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ జీఐసీతో పాటు కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌2, టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, అబుదాబి సావరిన్‌ ఫండ్‌ ఏడీక్యూ వంటి అంతర్జాతీయ పీఈ సంస్థలతో పాటు మాతృసంస్థ వాల్‌మార్ట్‌ కూడా ఈ పెట్టుబడులు పెట్టింది. అయితే ఎవరెవరు ఎంత మేరకు పెట్టుబడులు పెట్టిందనేది మాత్రం ఫ్లిప్‌కార్ట్‌ ఎలాంటి స్పష్ట ఇవ్వలేదు.

కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌..

కాగా, మరో వైపు కెనడా పెన్షన్‌ ఇన్వెస్ట్‌ మెంట్ మాత్రం రూ.5,968 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. దేశీయంగా ఈ-కావర్స్‌ రంగంలో పెరుగుతున్న అవకాశాలను చేజిక్కించుకునేందుకు గాను ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫ్టిప్‌కార్ట్‌ తెలిపింది. అయితే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఏర్పాట్లు చేస్తోందని, అందులో భాగంగానే పెద్దఎత్తున నిధులను సమకూర్చుకోవటమే కాకుండా కంపెనీ విలువను పెంచుకుంటూ వస్తోందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అలాగే ఉద్యోగులకూ ఫ్లిప్‌కార్ట్‌ గుడ్‌న్యూస్‌ అందించింది. ఎంప్లాయీస్‌ స్టాక్‌ ఆప్షన్స్‌ కింద ఉద్యోగుల వద్ద ఉన్న షేర్లలో 10 శాతం షేర్లను బైబ్యాక్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ బైబ్యాక్‌ వాల్యుయేషన్‌ ఎంత ఉంటుందనే విషయం కంపెనీ వెల్లడించలేదు. అయితే దీని విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా ఉంది.

ఇవీ కూడా చదవండి

Redmi Note 10T 5G: రెడ్​మీ నోట్ 10టి స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల తేదీ ఖరారు.. అద్భుతమైన ఫీచర్స్‌

Jio: తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో.. తాజా నివేదిక విడుదల చేసిన ట్రాయ్‌