Indian Railways: సెకండ్ ఏసీ టు థర్డ్ ఏసీ.. చిన్న పొరపాటుతో రైల్వేకు భారీ జరిమానా.. అసలేం జరిగిందంటే..

సెకండ్ ఏసీ టికెట్ తీసుకున్నాడు.. కానీ.. ఐఆర్‌సీటీసీ, రైల్వే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా థర్డ్ ఏసీ టికెట్ ను కన్ఫామ్ చేసింది. అయితే, సదరు రైలు ప్రయాణికుడు వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేయగా.. ధర్మాసనం.. ఐఆర్‌సీటీసీకి రూ.10వేల ఫైన్ వేసింది.

Indian Railways: సెకండ్ ఏసీ టు థర్డ్ ఏసీ.. చిన్న పొరపాటుతో రైల్వేకు భారీ జరిమానా.. అసలేం జరిగిందంటే..
Indian Railway

Updated on: Feb 19, 2024 | 11:02 AM

సెకండ్ ఏసీ టికెట్ తీసుకున్నాడు.. కానీ.. ఐఆర్‌సీటీసీ, రైల్వే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా థర్డ్ ఏసీ టికెట్ ను కన్ఫామ్ చేసింది. అయితే, సదరు రైలు ప్రయాణికుడు వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేయగా.. ధర్మాసనం.. ఐఆర్‌సీటీసీకి రూ.10వేల ఫైన్ వేసింది. ఈ ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. ఉత్తర రైల్వే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మేనేజర్‌కు చండీగఢ్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.10వేల ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. జిరాక్‌పూర్ కు చెందిన కుటుంబసభ్యుల బెర్త్‌లను 2వ ఏసీ నుండి 3వ ఏసీకి ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేసినందుకు రూ.10,000 మొత్తాన్ని చెల్లించాలని కోరింది.

ఫిర్యాదుదారు అయిన పునీత్ జైన్, ఆగస్టు 2018న తనకు, తన కుటుంబ సభ్యులకు శ్రీ వైష్ణో దేవి-కల్కా ఎక్స్‌ప్రెస్‌లో వైష్ణో దేవి నుంచి చండీగఢ్‌కు ప్రయాణం కోసం 2వ AC టికెట్లను రూ. 2,560 తో కొనుగోలు చేశాడు. అయితే, అతను తన కుటుంబంతో అక్టోబర్ 20, 2018న కత్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వారి బెర్త్‌లు డౌన్‌గ్రేడ్ చేసినట్లు తెలిసింది. దీని తర్వాత, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టిటిఇ)తో సమస్యను పరిష్కరించడానికి జైన్ ప్రయత్నించగా ఫలించలేదు. దీంతో వారు 3వ ఎసి కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించవలసి వచ్చింది. దీంతో థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ లో అపరిశుభ్రత, 2వ ఏసీ సదుపాయాలు లేకపోవడంతో ఫిర్యాదుదారు కుటుంబీకులు నిరుత్సాహానికి గురయ్యారు.

తర్వాత, జైన్ 3 AC టికెట్, 2 AC టిక్కెట్ మధ్య ఉన్న టిక్కెట్‌పై ఉన్న వ్యత్యాసాన్ని తిరిగి చెల్లించాలని రైల్వే అధికారులను అభ్యర్థించాడు. కానీ దానిని కూడా అధికారులు తిరస్కరించారు. తర్వాత అతను ఉత్తర రైల్వే, IRCTC సబ్-డివిజనల్ మేనేజర్/డివిజనల్ మేనేజర్‌కి మొత్తం విషయాన్ని ఇమెయిల్ చేశాడు. దానికి కూడా రిప్లే రాలేదు..

అయితే, సెకండ్ ఏసీ టికెట్‌కు రూ. 1,280 ఉండగా, 3వ ఏసీ టికెట్‌కు రూ.765 మాత్రమే ధర ఉంది. ఒక్కో టిక్కెట్‌పై దాదాపు రూ. 515 తేడా ఉండటాన్ని గమనించి.. దీనిపై వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేశాడు.

ఉత్తర రైల్వే సబ్-డివిజనల్ మేనేజర్/డివిజనల్ మేనేజర్ ప్రకారం.. జైన్ ఈ విషయానికి సంబంధించిన అవసరమైన సర్టిఫికేట్ అందించలేదు.. అతను సుదీర్ఘ కాలం తర్వాత సమస్యను దాఖలు చేశాడని.. చిరవరకు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు.

IRCTC, ఉత్తర రైల్వే కు జరిమానా..

ఈ విషయంపై IRCTC వైఖరి ఏమిటంటే, ఇది కేవలం ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం సేవా ప్రదాత మాత్రమే.. జైన్ కోరిన ఉపశమనాలకు బాధ్యత వహించదని పేర్కొంది. సేవలో లోపం, ఉత్తర రైల్వే, IRCTC బాధ్యతల లోపం కారణంగా.. కమిషన్ జైన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కమిషన్.. ఉత్తర రైల్వే, IRCTCని అక్టోబర్ 20, 2018 నుంచి 9% వార్షిక వడ్డీతో రూ. 5,000 పరిహారంగా, రూ. 4,000 పిటీషన్ ఖర్చులతో పాటుగా జైన్ కు రూ. 1,005 చెల్లించాలని కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..