Railway Employees: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పబోతోంది. త్వరలోనే రైల్వే ఉద్యోగులకు నైట్‌డ్యూటీ అలవెన్స్‌ను ప్రభుత్వం అందించనున్నట్లు సమాచారం. నైట్ డ్యూటీ అలవెన్స్ రూల్స్ మార్చిన తర్వాత బేసిక్ వేతనం రూ.43,600కుపైగా ఉన్నవారికి నైట్ డ్యూటీ అలవెన్స్‌ను ఇవ్వడం లేదు. అయితే ప్రస్తుతం ఈ అలవెన్స్ వీరికి కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిని త్వరగా పరిష్కరించాలని రైల్వే మంత్రిత్వశాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు అభ్యర్థన పెట్టుకుంది. బేసిక్ వేతనం రూ.43,600కుపైగా ఉన్న ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్స్ నిలిపివేయడంతో 3 లక్షల మందికిపైగా రైల్వే ఉద్యోగులపై నేరుగా ప్రభావం చూపనుంది. నైట్ డ్యూటీ అలవెన్స్‌ను రాత్రి పూట రైళ్లు నడిపే డ్రైవర్లకు, ఆపరేటర్లకు, నిర్వహణ కూలీలకు అందజేస్తారు. అయితే వారి ప్రయోజనాలు కాపాడేందుకు నైట్ డ్యూటీ అలవెన్స్‌ను మళ్లీ వారికి ఇవ్వాల్సిందేనని రైల్వే కోరుతోంది.
కాగా, దీనిని రైల్వే మంత్రిత్వశాఖ పరిశీలించి రైల్బే బోర్డు ఆమోదం కోసం పంపింది. బోర్డు ఆమోదం కోసం, ఎక్స్‌పెండించర్ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఈ ప్రతిపాదనను స్వీకరించినట్లు రైల్వే బోర్డు సెక్రటరీ తెలిపారు. త్వరలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారని, నైట్ డ్యూటీ అలవెన్స్ జారీ చేస్తూ ఆర్డర్లు వెలువడతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి: