
భారతీయులకు బంగారం అంటే ప్రత్యేక సెంటిమెంట్. శుభకార్యమైన లేదా పండగైనా బంగారం కొనాల్సిందే.. బంగారం వారీ భాగమైపోయింది. అయితే ప్రస్తుత ధరలు సామాన్యుడికి గట్టి షాక్ ఇస్తున్నాయి. గత కొంత కాలంగా పసిడి పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ మైలురాయిని అధిగమించింది. సోమవారం స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 5,092 డాలర్లకు చేరుకుంది. అంటే భారతీయ కరెన్సీలో ఒక గ్రాము బంగారం ధర సుమారు రూ.16,410 కి పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది.
ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థలు బంగారం ధరలపై సంచలన అంచనాలు వేస్తున్నాయి. గోల్డ్‌మన్ సాచ్స్ 2026 డిసెంబర్ నాటికి ఔన్సు ధర 5,400 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. మెటల్స్ ఫోకస్ ఈ ఏడాది చివరి నాటికి ధర 5,500 డాలర్ల వరకు వెళ్లొచ్చని తెలిపింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే అంశం ఏంటంటే..రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి అంచనా. భవిష్యత్తులో ఔన్సు బంగారం ధర 27,000 డాలర్లకు చేరుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఆయన అంచనా నిజమైతే, ఒక గ్రాము బంగారం ధర రూ. 87,154 అవుతుంది. అప్పుడు ఒక కిలో బంగారం కొనాలంటే ఏకంగా రూ. 8.71 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఈ ధర ఎప్పటికి చేరుకుంటుందనే దానిపై ఆయన కాలపరిమితి ప్రకటించలేదు. అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ఎప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుంది. ప్రస్తుత ధరలను చూస్తుంటే సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షలా మారుతోందని స్పష్టమవుతోంది.
GOLD soars over $5000.
Yay!!!!
Future for gold $27,000.
— Robert Kiyosaki (@theRealKiyosaki) January 26, 2026
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..