ఉన్నోడికి.. లేనోడికి ఇదొక్కటే తేడా.. తెలుసుకోకుంటే మీరెప్పటికీ పేదవారే..

| Edited By: Janardhan Veluru

Mar 05, 2025 | 7:24 PM

డబ్బు సంపాదించడమెలా అని గూగుల్ లో వెతికితే మొదటి స్థానంలో మనకు కనిపించేది ఈ పుస్తకమే. 2002లో రాబర్ట్ డి. కియోస్కి అనే రచయిత రాసిన ఈ పుస్తకం ఇప్పటి వరకు 46 మిలియన్ కాపీలు అమ్ముడైంది. ప్రపంచవ్యాప్తంగా 109 దేశాలలో 51 వేర్వేరు భాషల్లోకి అనువదించారు. తెలుగులోనూ ఉంది..

ఉన్నోడికి.. లేనోడికి ఇదొక్కటే తేడా.. తెలుసుకోకుంటే మీరెప్పటికీ పేదవారే..
Financial Freedom
Follow us on

ప్రపంచంలో డబ్బున్నవారు మరింత ధనికులుగా పేదవారు నిరుపేదలుగా మారిపోతునే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా డబ్బు సంపాదించే మార్గాల కోసం మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడు. అసలింతకీ డబ్బు సంపాదించడం ఎలా? డబ్బు వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అనే విషయాలను రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలో వివరించారు. మరి అలా అయితే ఈ పుస్తకం చదివిన వారంతా ధనవంతులవుతున్నారా? అని మీకు సందేహం కలగవచ్చు. ఈ పుస్తకంలోని అసలు సారాంశాన్ని గ్రహించగలిగితే డబ్బును తేలికగా సంపాదించడమెలాగో మీకే తెలుస్తుంది. రిచ్ డాడ్ పూర్ డాడ్ లో ఉన్న సీక్రెట్స్ ఏంటో క్లుప్తంగా తెలుసుకోండి..

ఈ పుస్తకం చదివితే ధనవంతులవుతారా?

నిజానికి ఈ పుస్తకం చదివిన వారంతా ధనికులేం అయిపోరు. ఇందులో రచయిత చెప్పాలనుకున్న అసలు సారాంశాన్ని అర్థం చేసుకోగలగాలి. తద్వారా మీకున్న అన్ని ప్రశ్నలకు సమాధానం దానికదే దొరుకుతుంది. ధనవంతులు కావాలంటే డబ్బు సంపాదించాలనే అపోహను ఈ పుస్తకం పటాపంచలు చేస్తుంది. కష్టపడి పనిచేస్తేనే కనకవర్షం కురుస్తుందా అనే సందేహాలను కూడా ఇందులో వివరణ ఉంది. రాబర్ట్ తెలిపిన వివరాల ప్రకారం. మీ ఆర్థిక పరిస్థితి మీ తెలివితేటల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకోలేకపోతే మీరెప్పటికీ పేదవారుగానే ఉండిపోతారు. మధ్యతరగతి వ్యక్తి డబ్బు ఉన్నా మధ్యతరగతి జీవితానికే అంకితమైపోతాడని చెప్తాడు.

ఉన్నోడికి.. లేనోడికి ఇదే తేడా..

ఇందులో ధనిక, పేద వర్గాల వ్యక్తుల మనస్తత్వాన్ని వివరించారు. పేద మధ్యతరగతి వారు బాధ్యతలను స్వీకరిస్తారు. తెలివైన వ్యక్తులు మాత్రమే డబ్బును సంపాదించగలరని అంటాడు. అంటే ఎవరైతే కూడబెట్టిన ధనాన్ని పెట్టుబడి రూపంలో ఖర్చు చేయరో వారు ఎప్పటికీ పేదవారిగానే ఉంటారంటాడు. ఉదాహరణకు స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టి మళ్లీ దాని ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించగలవాడే ఎప్పటికైనా ధనవంతుడు కాగలడని రచయిత చెప్తాడు. ఇలా తన దగ్గరున్న డబ్బును బాధ్యతలు తీర్చుకోవడానికి కాకుండా సరికొత్త పెట్టుబడుల కోసం దారులు వెతికే వాడే తెలివైన వ్యక్తులని పేర్కొంటాడు.

రీసెర్చ్ చేయగలగాలి..

కేవలం ఈ పుస్తకాన్ని చదివి దగ్గరుంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాని గురించిన పరిశోధన చేయాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే మీరు ఒక స్టాక్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే దానిని మీ కంపెనీగా భావించాలి అంటే మీరు ఆ కంపెనీలో పెట్టుబడి పెడితే, మనకు ఎలాంటి వృద్ది వస్తుంది, కంపెనీ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో ఆ కంపెనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది అనే విషయాలపై రీసర్చ్ చేయాలి. ఈ పరిశోధన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.