Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రూ. 6 వేలు పొందేందుకు మీరు అర్హులేనా ?.. ఒక్కసారి తెలుసుకోండి..

ఇప్పటివరకు 11 విడతల నగదను విడుదల చేసింది ప్రభుత్వం. ఇక ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో 12వ విడత డబ్బు ఖాతాల్లో పడనున్నాయి.

PM Kisan: రూ. 6 వేలు పొందేందుకు మీరు అర్హులేనా ?.. ఒక్కసారి తెలుసుకోండి..
Pm Kisan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 20, 2022 | 11:38 AM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులు ప్రయోజనాలను పొందారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఏడాది మూడు విడతలుగా రూ. 2 వేలు చొప్పున మొత్తం రూ. 6 వేలు అన్నదాత ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 11 విడతల నగదను విడుదల చేసింది ప్రభుత్వం. ఇక ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో 12వ విడత డబ్బు ఖాతాల్లో పడనున్నాయి. అయితే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నప్పటికీ మీరు అర్హులా కాదా అనే సందేహంతో ఉన్నారా ? ఈ స్కీమ్ కు ఎవరెవరు అర్హులు.. ఎవరు అనర్హులో తెలుసుకోండి.

* ఆర్థికంగా ఉన్నత స్థితి కలిగిన వారు ఈ పథకానికి అనర్హులు. అలాగే సంస్థాగత భూస్వాములు కూడా అనర్హులు. * రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు, మాజీ, ప్రస్తుత హోల్డర్లు, మాజీ మంత్రులు, ప్రస్తుతం పదవిలో ఉన్నవారు, శాసన మండలి సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్‏లు, ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయితీ ఉద్యోగులు అనర్హులు. * కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాలు/డిపార్ట్‌మెంట్‌లు, దాని ఫీల్డ్ యూనిట్లు సెంట్రల్ లేదా స్టేట్ PSEలు, ప్రభుత్వ పరిధిలోని అటాచ్డ్ కార్యాలయాలు/ స్వయంప్రతిపత్తి సంస్థలు అలాగే స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ సిబ్బందిని మినహాయించి) సేవలందిస్తున్న లేదా పదవీ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగులు క్లాస్ IV/గ్రూప్ D ఉద్యోగులు) అనర్హులు. * నెలకు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే (మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ క్లాస్ IV/గ్రూప్ D ఉద్యోగులు మినహా) అన్ని పదవీ విరమణ పొందిన/రిటైర్డ్ పెన్షనర్లు అనర్హులు. * గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించినవారు కూడా అనర్హులు. * డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు వంటి నిపుణులు వృత్తిపరమైన సంస్థలతో నమోదు చేసుకున్నారు.

ఇప్పటివరకు 11 విడతల నగదు పొందిన అర్హులైన రైతులు వెంటనే తమ పీఎం కిసాన్ e-kycని జూలై 31లోపు పూర్తిచేయాలి. గడువు ముగిసేలోపు e-kycని పూర్తి చేయకపోతే నగదు రాదు.