RBI: బ్యాంకింగ్ రంగంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏదైనా లావాదేవీలు జరిపే కస్టమర్లు ఇక నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు సేవ్ చేసి ఉండవని ఇటీవల ఆర్బీఐ కొత్త నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కూడా వెల్లడించింది. కానీ ప్రస్తుతం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులకు ఊరట కలిగించే విషయం తెలియజేసింది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల టోకనైజేషన్ విధానాల అమలును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు డేటాను నిల్వ చేసేందుకు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో కొత్త టోకెనైజేషన్ విధానం 2022 జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.
కార్డుల సెక్యూరిటీ నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఇప్పుడు యూజర్లకు ఊరట కలిగించింది. కార్డుల సెక్యూరిటీ నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఇక నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఈ-కామర్స్ సంస్థలు, వెబ్‌సైట్‌లలో వినియోగదారుల కార్డ్ సమాచారాన్ని సేవ్ చేయలేరు అంటూ ఇప్పటికే బ్యాంకులు తమతమ ఖాతాదారులకు జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు ఉంటాయని మెసేజ్‌లను కూడా చేరవేసింది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకు కస్టమర్లకు మేలు కలిగించింది. టోకనైజేషన్ పాలసీతో ఆయా క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను బహిర్గతం చేయకుండా ఆన్‌లైన్‌లో షాపింగ్‌లకు, ఇతర కొనగోళ్లకు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ట్రేడ్ యూనియన్ వ్యాపారులు కోరిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ టోకనైజేషన్ విధానంతో పలు అంతరాయాలను కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి: