Reliance Retail: ఫాస్ట్‌ఫుడ్‌ ఇండస్ట్రీపై కన్నేసిన రిలయన్స్‌.. వణికిపోతున్న డొమినోస్‌, కేఎఫ్‌సీ

|

Aug 02, 2021 | 12:59 PM

Reliance Retail: ఫాస్ట్‌ఫుడ్‌ ఇండస్ట్రీలో భారీ పెట్టుబడులకు రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దిగ్గజ సంస్థ క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌..

Reliance Retail: ఫాస్ట్‌ఫుడ్‌ ఇండస్ట్రీపై కన్నేసిన రిలయన్స్‌.. వణికిపోతున్న డొమినోస్‌, కేఎఫ్‌సీ
Reliance Retail
Follow us on

Reliance Retail: ఫాస్ట్‌ఫుడ్‌ ఇండస్ట్రీలో భారీ పెట్టుబడులకు రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దిగ్గజ సంస్థ క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌ (QSR) చైన్‌ కంపెనీ సబ్‌బే ఇండియాను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం రిలయన్స్‌ రిలైల్‌ రూ.1,860 కోట్ల డీల్‌కు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త దేశీయంగా వాణిజ్య పరంగా హట్‌టాపిగ్గా మారింది. అయితే రియలన్స్‌ ఇండస్ట్రీ ఇప్పటికే వ్యాపార రంగంలో దూసుకుపోతోంది. వ్యాపార రంగంలో కీలకమైన ఒప్పందాలు చేసుకుంటూ ఇతర వ్యాపార రంగాలకు షాకిస్తోంది.

అయితే భారతదేశంలో శాండ్విచ్‌లో నైపుణ్యం కలిగిన అమెరికన్‌ ఫుడ్‌ దిగ్గజం అనేక ప్రాంతీయ మాస్టర్‌ ఫ్రాంచైజీల ద్వారా వ్యాపారం చేస్తోంది. అయితే సబ్‌బే ప్రధాన కార్యాలయం యూఎస్‌ఏలో ఉంది. డోమినో ఫిజ్జా, బర్గర్‌ కింగ్‌, ఫిజ్జా, స్టార్‌బక్స్‌ భాగస్వామిలతో టాటా గ్రూప్‌, జాబిలెంట్‌ గ్రూప్‌ ఒప్పందం తర్వాత ఈ రిలయన్స్‌ రిటైల్‌తో పోటీ పడుతోంది. సబ్‌బే ఫ్రాంచైజ్‌ కార్యకలాపాలను కొనుగోలు చేయడానిక ప్రయత్నిస్తోంది. ఈ డీల్‌ తర్వాత రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ రిటైల్‌ యూనిట్స్‌ భారతదేశ వ్యాప్తంగా 600 సబ్‌వే స్టోర్‌లను ఏర్పాటు చేయనుంది. సబ్‌వే భాగస్వామి ద్వారా భారత్‌లో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని చూస్తోంది రిలయన్స్‌. అయితే ఢిల్లీకి చెందిన చేతన్‌ అరోనా, సచిన్‌ అరోరా, మన్‌ప్రీత్‌ గులారి, రిషి బజోరియా గుల్‌ప్రీత్‌ గులారి, రాహుల్‌ భల్లాలు భారతదేశంలో సబ్‌వేకు ప్రధాన డెవలప్‌మెంట్‌ ఏజెంట్లుగా పని ఉన్నారు. యూఎస్‌ ఆధారిత రెస్టారెంట్‌ మాస్టర్‌ ఫ్రాంచైజీ నియమించిన సబ్‌- ఫ్రాంచైజీల ద్వారా స్టోర్‌లను నిర్వహిస్తోంది.

అయితే సబ్‌బే యూనిట్స్‌ భారతదేశంలో ఒక్క స్టోర్‌ కూడా లేదు. కానీ ప్రతి ఫ్రాంచైజీ నుంచి 8 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే సబ్‌వే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాడ్‌చిడ్స్‌ నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాపారం దెబ్బతిన్నందున ఖర్చులను మరింతగా తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఫుడ్‌ ఇండస్ట్రీలో దిగడంతో దేశ వ్యాపార వర్గాలో సంచలనంగా మారుతోంది.ఈ డీల్‌ పూర్తయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశ వ్యాప్తంగా 600 సబ్‌వే స్టోర్‌లను ఏర్పాటు చేయనుంది.

ఇవీ కూడా చదవండి

Bank Customers: ఈ బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. అక్టోబర్‌ 1 నుంచి అవి చెల్లుబాటు కావు.. విత్‌డ్రా చేసుకోలేరు!

PM Kisan Scheme: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు.. ఎప్పుడంటే..?