Reliance Jio: జియో ఎయిర్ ఫైబర్‌పై అంబానీ సంచలన నిర్ణయం.. 50 రోజుల ఉచిత ట్రయల్‌

Reliance Jio: రిలయన్స్ జియో జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ సేవలపై 50 రోజుల ఉచిత ట్రయల్ ఆఫర్‌ను ప్రారంభించింది. కొత్త, ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఇందులో 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, OTT యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది..

Reliance Jio: జియో ఎయిర్ ఫైబర్‌పై అంబానీ సంచలన నిర్ణయం.. 50 రోజుల ఉచిత ట్రయల్‌

Updated on: Feb 17, 2025 | 5:04 PM

రిలయన్స్ జియో ఉచిత ట్రయల్‌ను అందిస్తోంది. జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ ఆఫర్‌కు కంపెనీ ‘జీరో రిస్క్ ట్రయల్’ అని పేరు పెట్టింది. కంపెనీ ప్రస్తుత ప్లాన్‌లో వినియోగదారులకు ఉచిత ట్రయల్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆఫర్ కొత్త, ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్‌లకు కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులకు 50 రోజుల ఉచిత ట్రయల్ అందిస్తోంది. కంపెనీ దీని గురించి సమాచారాన్ని సోషల్ మీడియాలో కూడా పంచుకుంది. మెసేజ్‌ పంపిన తర్వాత మీరు ఈ సర్వీస్‌ను యాక్టివేట్ చేయవచ్చు.

ఈ ఆఫర్‌ను జియో ఫిబ్రవరి 28, 2025 వరకు అందిస్తోంది. ఈ ఆఫర్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే వారికి జియో ఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ 50 రోజుల ఉచిత ట్రయల్ అందిస్తుంది. టీవీ ఛానెల్‌లు, OTT యాప్‌లు కూడా ఇందులో చర్చింది జియో. వినియోగదారులకు ఉచిత సెట్-టాప్-బాక్స్, ఉచిత రూటర్‌, ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను కూడా అందిస్తోంది.

ఆఫర్ ఎలా పొందాలి?

ఇవి కూడా చదవండి

కొత్త కస్టమర్లు 50 రోజుల ట్రయల్ తో వచ్చే రూ.1234 రీఫండబుల్ మొత్తాన్ని చెల్లించాలి. ట్రయల్ తర్వాత సర్వీస్ కొనసాగించాలనుకుంటే, అతనికి రూ. 1234 క్రెడిట్ లభిస్తుంది. అతను ఈ క్రెడిట్‌ను 50 రోజుల పాటు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మీరు 50 రోజుల తర్వాత రూ.599 ప్లాన్‌ను కొనుగోలు చేస్తే, మీ వాలెట్‌లోని బ్యాలెన్స్ రూ.1234 అవుతుంది. మొదటి రీఛార్జ్ దీని నుండి అవుతుంది. మిగిలిన బ్యాలెన్స్‌ను తదుపరి రీఛార్జ్‌లో ఉపయోగించవచ్చు. ఒక వినియోగదారు సేవను కొనసాగించకూడదనుకుంటే రుసుము తగ్గించిన తర్వాత అతనికి రూ. 979 రీఫండ్ లభిస్తుంది.

ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులు వాట్సాప్‌లో సందేశం పంపాలి. దీనిలో, వారు ‘ట్రయల్’ అని వ్రాసి 60008 60008 కు సందేశం పంపాలి. మీరు రీఛార్జ్ చేసిన తర్వాత, మీకు ప్రయోజనాలు లభించడం ప్రారంభమవుతుంది. ట్రయల్ గురించి చెప్పాలంటే, ఇది 800+ టీవీ ఛానెల్‌లు, 13 OTT యాప్‌లు మరియు అనేక ఇతర ప్రయోజనాలతో వస్తుంది.

జియో ఎయిర్ ఫైబర్ 599 రీఛార్జ్

జియో ఎయిర్ ఫైబర్ యొక్క అత్యంత చౌకైన రీఛార్జ్ రూ. 599. ఇది 30 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. అలాగే, 30Mbps వేగంతో లభిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 1000GB డేటా అందుబాటులో ఉంది. 800+ టీవీ ఛానెల్‌లతో పాటు, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, సన్ నెక్స్ట్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఇవ్వబడుతుంది.

జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ 1499 రీఛార్జ్

రూ.1499 రీఛార్జ్‌తో జియో ఎయిర్ ఫైబర్‌ను తీసుకువచ్చింది. ఇందులో వినియోగదారులకు 30 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. 300 Mbps వేగంతో 1000GB డేటా అందిస్తుంది. 800+ టీవీ ఛానెల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు OTT ప్రయోజనాలను కూడా పొందుతున్నారు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ప్రీమియం, డిస్నీ + హాట్‌స్టార్ వంటి అనేక OTT ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: Aadhaar Updates: ఆధార్‌లో ఈ వివరాలు ఒక్కసారి మాత్రమే అప్‌డేట్‌ చేసేందుకు అవకాశం.. అదేంటో తెలుసా..?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి