Reliance Jio: జియో మరో సంచలనం.. దేశంలోనే మరో భారీ రికార్డ్ దిశగా అడుగులు

త్వరలో దేశంలోనే అతి పెద్ద ఐపీఓ రానుంది. అదే రిలయన్స్ జియో. 2026 ప్రాథమార్థంలో జియో ఐపీఓను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. జియోను ఐపీఓకు తీసుకురానున్నట్లు గత ఏడాది ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

Reliance Jio: జియో మరో సంచలనం.. దేశంలోనే మరో భారీ రికార్డ్ దిశగా అడుగులు
jio

Updated on: Jan 10, 2026 | 1:56 PM

Mukesh Ambani: ప్రముఖ టెలికాం రంగ సంస్థ అయిన రిలయన్స్ జియో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పబ్లిక్ ఐపీఓకు రావాలని నిర్ణయించింది. దాదాపు రూ.36 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు నిధులు సమీకరించేందుకు ఐపీఓకు రానుంది. ఈ ఏడాదిలోనే ఐపీఓలో లిస్ట్ కానుందని తెలుస్తోండగా.. ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద ఐపీఓ‌గా దీనిని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 2.5 శాతం వాటాను రిలయన్స్ విక్రయించనుందని తెలుస్తోంది. జియో ఐపీఓ ఎప్పుడెప్పుడు వస్తుందా అని స్టాక్ మార్కెట్ వర్గాలు, ఇన్వెస్టర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు అది జరగనుంది.

ఆ రెండు బ్యాంకులతో డీల్

ఐపీఓను తెచ్చేందుకు రెండు ప్రముఖ బ్యాంకులతో రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీఓ డాక్యుమెంట్స్, ప్రాసెస్‌ బాధ్యతలను కోటక్ మహీంద్ర బ్యాంక్, మోర్గాన్ స్టాన్లీకి అప్పగించింది. 2026 తొలి ప్రథమార్థంలోనే జియో ఐపీఓకు రానుందని తెలుస్తోంది. జియోను ఐపీఓకు తీసుకురానున్నట్లు గత ఏడాది ఆగస్టులో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు రాకపోవడంతో ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా దీనిని చెబుతుండటంతో ఇన్వెస్టర్లను తెగ ఆకర్షిస్తోంది.

దేశంలోనే అతి పెద్ద ఐపీఓలు

ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద ఐపీఓలుగా హ్యుందాయ్, ఎల్‌ఐసీ, పేటీఎం, జీఐసీ, ఎన్‌ఐఏ, జొమాటో నిలిచాయి. 2024లో హ్యుందాయ్ రూ.27,870 కోట్లు, 2022లో ఎల్‌ఐసీ రూ.21,008 కోట్లు, 2021లో పేటీఎం రూ.18,300 కోట్లు, 2017లో జీఐసీ రూ.11,176 కోట్లు, 2017లో ఎన్‌ఐఏ రూ.9,600 కోట్లు, 2021లో జొమాటో రూ.9,375 కోట్లతో ఐపీఓకు వచ్చాయి. వీటికి పెట్టుబడిదారుల నుంచి ఫుల్ డిమాండ్ వచ్చింది. దీంతో రానున్న జియో ఐపీఓకు భారీ స్పందన వచ్చే అవకాశముంది.