Jio: జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!

|

Nov 23, 2024 | 6:21 PM

Jio Plan: ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు టారీఫ్‌ ధరలు పెంచిన తర్వాత వినియోగదారులంతా బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు. దీంతో జియో తన కస్టమర్లను నిలుపుకొనేందుకు వివిధ ప్లాన్‌ ఆఫర్లను ప్రకటిస్తుంది. తక్కువ ధరల్లో కొన్ని రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది..

Jio: జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
మీరు రిలయన్స్ జియో సిమ్ ఉపయోగిస్తుంటే మీకో శుభవార్త ఉంది. జియో జూలై నెలలో తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఖరీదైన ప్లాన్‌ల కారణంగా లక్షలాది మంది వినియోగదారులు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNLకి మారారు. ఇప్పుడు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, Jio దీర్ఘ కాల వ్యాలిడిటీతో గొప్ప ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
Follow us on

రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది 5G అప్‌గ్రేడ్ డేటా వోచర్ ప్లాన్. ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటా ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది వార్షిక డేటా ప్లాన్. ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీని అందిస్తుంది. రిలయన్స్ జియో అపరిమిత 5జీ డేటాను అందిస్తోంది. ఇది ప్రమోషన్ స్ట్రాటజీ రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్‌లో 2 GB డేటా అందిస్తుంది.

రూ.601 ప్లాన్

జియో కొత్త 5G అప్‌గ్రేడ్ వోచర్ ప్లాన్ అపరిమిత 5G సేవను అందిస్తుంది. జియో రూ.601 ప్లాన్ 12 డేటా వోచర్లను అందిస్తుంది. ఈ ప్లాన్‌ని కుటుంబం, స్నేహితులకు కూడా ఇవ్వవచ్చు. ఇది డేటా వోచర్ ప్లాన్. మీరు ఈ ప్లాన్ కోసం ముందుగానే మీరు సాధారణ యాక్టివ్‌ ప్లాన్‌ ఉండాలి. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, మెసేజింగ్ సౌకర్యం అందుబాటులో లేదు. ఇది 2G రోజువారీ డేటా ప్లాన్‌ మాత్రమే.

ఇవి కూడా చదవండి

అపరిమిత 5G

ఈ డేటా ప్యాక్‌తో వినియోగదారులు అపరిమిత 5G డేటాను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ రూ. 51కి 12 డేటా వోచర్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌ని My Jio యాప్, వెబ్‌సైట్ నుండి యాక్టివేట్ చేయవచ్చు. ఈ ప్లాన్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత, వినియోగదారులు జియో 5G నెట్‌వర్క్‌లో అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్‌లో జియో ఇప్పటికే యాక్టివ్ ప్లాన్‌ని కలిగి ఉండాలి.

మీరు ప్రీపెయిడ్ కస్టమర్‌గా రూ. 601 డేటా వోచర్ ప్లాన్‌ని తీసుకుంటే, మీరు 12 వ్యక్తిగత డేటా వోచర్ ప్లాన్‌లను యాక్టివేట్ చేయగలుగుతారు. ఈ వ్యక్తిగత డేటా ప్లాన్ ధర రూ. 51. ఈ ప్లాన్ ఒక నెల పాటు అపరిమిత 5G డేటాను అందిస్తుంది. కస్టమర్‌లు 12 వోచర్‌లను రీడీమ్ చేసుకోవచ్చు. ఇందులో అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. 1.5GB/రోజు ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వారికి కొత్త రూ.601 డేటా వోచర్ ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎవరు అపరిమిత 5G డేటా సేవను పొందవచ్చు

ఇది కాకుండా, జియో 5G కనెక్టివిటీని అందించే మూడు 5G ప్లాన్‌లను అందిస్తుంది. జియో రూ.51, రూ.101, రూ.151 ప్లాన్‌లు రోజుకు 1.5GB, 2GB డేటాను అందిస్తాయి. జియో కస్టమర్లు రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌పై అపరిమిత 5G డేటాను యాక్సెస్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి