Mukesh Ambani: దేశంలో అత్యంత ధనవంతుడు అయినప్పటికీ ముఖేష్ అంబానీ పర్సులో ఎప్పుడూ డబ్బులు ఉండవట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతోపాటు.. ఆయన వ్యక్తిగతానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించారు. ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత ధనవంతుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు బిలియన్ల సంపద ఉంది. దాంతో ప్రతీ ఒక్కరూ ముఖేష్ అంబానీ వద్ద ఎప్పుడూ భారీగా డబ్బు ఉంటుందని భావిస్తుంటారు. అయితే, ఆయన చేబులో చిల్లిగవ్వ కూడా ఉండదట. అలాగే ఏ క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో ఉంటాయని అనుకున్నా పొరబడినట్లే. క్రెడిట్ కార్డులు గానీ, డెబిట్ కార్డులు గానీ ఆయన వద్ద ఉండవట. ఆయన పర్స్ ఎప్పుడూ ఖాళీగానే ఉంటుందట.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ముఖేష్ అంబానీ.. డబ్బు గురించి తనకు పెద్దగా పట్టింపు ఉండదన్నారు. డబ్బు ఉండటం వల్ల ఒక భావన తనలో కలుగుతుందని, అందువల్ల చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ తన జేబులో డబ్బులు పెట్టుకోలేదన్నారు. తాను ఏమైనా కొనుగోలు చేసినప్పుడు చెల్లింపులు చేసేందుకు, తనకు సహాయం చేయడానికి తన చుట్టూ ఎప్పుడూ ఉంటారని చెప్పుకొచ్చారు. అందుకే డబ్బు జేబులో ఉంచుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదన్నారు.
క్రెడిట్ కార్డు కూడా లేదు..
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు లేని వారు చాలా అరుదు. దాని అవసరం అంతలా ఉంటుంది మరి. చాలా మంది క్రెడిట్ కార్డుపై ఆధారపడుతుంటారు. అయితే మీకు తెలుసా ముఖేష్ అంబానీ వద్ద ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు లేదట. అంతేకాదు.. వినియోగించనూ లేదట. తన ఆర్థిక ఖర్చుల వివరాలన్నీ తన సహాయకులు చూసుకుంటారని ముఖేష్ అంబానీ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఎప్పుడైన డబ్బు అవసరం అయితే తన సన్నిహితులు తనకు సాయం చేస్తారని చెప్పుకొచ్చారు.
స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం..
తనకు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని ముఖేష్ అంబానీ వెల్లడించారు. రోడ్డుపైకి వెళ్లినప్పుడు, రోడ్డుపై మంచి ఫుడ్ కనిపిస్తే వెంటనే అక్కడ ఆగిపోయి తినేస్తానని చెప్పుకొచ్చారు. రోడ్డు పక్కన బండిపై చేసే ఫుడ్‌ను తినేందుకు ఏమాత్రం వెనుకాడనని అన్నారు. ప్రదేశం ఏదైనా రుచి మంచిదని అన్నారు.
Also read:
Kim Yo-jong: మరీ ఇలా ఉన్నారంటి సామీ.. అన్నను మించిన చెల్లి.. అలాంటి వారిని చంపేయండి అంటూ ఆర్డర్..