Jio World Center: ‘జియో వరల్డ్ సెంటర్‌’ను ప్రారంభించిన రిలయన్స్ ఇండస్ట్రీస్

|

Mar 04, 2022 | 9:58 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక బహుముఖ డెస్టినేషన్ అయిన జియో వరల్డ్ సెంటర్‌(Jio World Center)ని ప్రారంభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఛైర్ పర్సన్ నీతా అంబానీ..

Jio World Center: ‘జియో వరల్డ్ సెంటర్‌’ను ప్రారంభించిన రిలయన్స్ ఇండస్ట్రీస్
Jio World Center
Follow us on

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక బహుముఖ డెస్టినేషన్ అయిన జియో వరల్డ్ సెంటర్‌(Jio World Center)ని ప్రారంభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఛైర్ పర్సన్ నీతా అంబానీ ప్లాన్ చేసిన ఈ కేంద్రం.. ముంబయి(Mumbai)లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో 18.5 ఎకరాల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఫలితంగా దేశానికి, పౌరులకి ప్రపంచ స్థాయి గుర్తింపు ఇవ్వనుంది. ముందుగా ధీరుభాయ్ అంబానీ స్క్వేర్, ముంబై నగరంలోని మ్యూజికల్ ఫౌంటైన్ ఆఫ్ జాయ్‌(Musical Fountain of Joy)తో ఆవిష్కరించి భారతదేశంలోని అతిపెద్ద, అత్యుత్తమ జియోవరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ సెంటర్లని ప్రస్తుత, వచ్చే సంవత్సరాలలో దశలవారీగా ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందించారు. దేశంలో మొట్టమొదటి డెస్టినేషన్ జియో వరల్డ్ సెంటర్ లో సాంస్కృతిక కేంద్రం, మ్యూజికల్ ఫౌంటెన్, ఉన్నత స్థాయి రిటైల్ అనుభవం, కెఫేలు, డైనింగ్ రెస్టారెంట్లు, సర్వీస్డ్ అపార్ట్మెంట్లు, ఆఫీసులు, అత్యాధునిక కన్వెన్షన్ సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. జియో వరల్డ్ సెంటర్ మన అద్భుతమైన దేశానికి నివాళి, న్యూ ఇండియా ఆకాంక్షలకు ప్రతిబింబం అని నీతా అంబానీ అన్నారు. జియో వరల్డ్ సెంటర్ ముంబయికి కొత్త మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది భారతదేశం వృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి నాందిగా నిలుస్తుందని ఆమె వెల్లడించారు.

ధీరూభాయ్ అంబానీ స్క్వేర్..

ముంబై నగరంలో మైలురాయిగా నిలిచింది ధీరూభాయ్ అంబానీ స్క్వేర్. రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీకి, ముంబై నగరానికి దీనిని అంకితం చేశారు. “ఇందులోకి ఉచిత ప్రవేశంతో పాటు బహిరంగ ప్రదేశం కలిగి ఉండి పర్యాటకులకి, స్థానిక పౌరులకి తప్పక చూడవలసిన గమ్యస్థానంగా మారింది. ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ ఫౌంటైన్ ఆఫ్ జాయ్ చుట్టూ నీరు, లైట్లు, మ్యూజిక్ అన్నీ కలిసి అద్భుతంగా ఉంటుంది. ఈ ఫౌంటైన్ భారతదేశం, దేశాన్ని గుర్తుచేసే అనేక రంగులకి చిహ్నంగా ఉంటుంది. ఇందులో ఎనిమిది ఫైర్ షూటర్లు, 392 వాటర్ జెట్లు, 600 కు పైగా ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. ఇవి సంగీతానికి అనుగుణంగా నృత్యం చేసే వికసిస్తున్న తామర రేకులతో మరపురాని ప్రదర్శనను సృష్టిస్తాయి” అని నీతా అంబానీ పేర్కొన్నారు.

మ్యూజికల్ ఫౌంటెన్‌…

మ్యూజికల్ ఫౌంటెన్‌ని అంకితం చేస్తూ నీతా అంబానీ మాట్లాడుతూ.. “ఎంతో సంతోషంతో, గర్వంతో ధీరూభాయ్ అంబానీ స్క్వేర్, ప్రపంచ స్థాయి ఫౌంటైన్ ఆఫ్ జాయ్‌ని ముంబై ప్రజలకి నగరానికి అంకితం చేస్తున్నాము. నగరస్ఫూర్తిని పురస్కరించుకుని, ఇది ప్రజలు ఆనందాలను పంచుకునే కొత్త బహిరంగ ప్రదేశం అవుతుందన్నారు. ప్రారంభం చేసే రాత్రి ఉపాధ్యాయులకు ప్రత్యేక గౌరవ ప్రదర్శన ఇవ్వడం తనకెంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తాను స్వయంగా ఉపాధ్యాయురాలిని అవడంతో, ఈ కష్ట సమయాల్లో అవిశ్రాంతంగా పనిచేసినందుకు, జ్ఞానాన్ని పంచుతున్నందుకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ప్రశంసించారు. గత రెండేళ్లలో జ్ఞానాన్ని పంచినందుకు, తర్వాతి తరాలలో కూడా మన దేశం అభివృద్ధి దిశలో ప్రయాణించడానికి కొత్త బోధనా పద్ధతులకు అనుగుణంగా వారు చేసిన కృషికి గౌరవసూచకంగా ముంబై అంతటా బీఎంసీ పాఠశాలలు, ఇతర పాఠశాలలకు చెందిన 250 మందికి పైగా ఉపాధ్యాయులను ప్రారంభ ప్రదర్శనకు ఆహ్వానించారు. ఈ స్క్వేర్ రోజూ సాయంత్రం ప్రదర్శనలతో తెరుచుకుంటుంది. dhirubhaiambanisquare.com ఉచిత ఎంట్రీ పాస్ లను బుక్ చేసుకోవచ్చు.

జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్..

భారతదేశ అత్యుత్తమ, అతిపెద్ద కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సౌకర్యాలను జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ అందిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ కన్వెన్షన్, ఎగ్జిబిషన్స్ ఎకో సిస్టమ్‌లో భారతదేశాన్ని అగ్ర స్థానంలో నిలపాలనే లక్ష్యాన్ని నిర్ధారించుకుంది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా వినియోగదారుల ప్రదర్శనలు, సమావేశాలు, మెగా కచేరీలు, విందులు, వివాహాలతో సహా విశిష్ట వ్యాపార మరియు సామాజిక కార్యక్రమాలకు భారతదేశపు అగ్రగామి వేదిక.

జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకతలు:

• 1,61స460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 3 ఎగ్జిబిషన్ హాళ్లు 16,500 మంది అతిథులకు సదుపాయం
• 1,07,640 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండు సమావేశ మందిరాలు 10,640 మంది అతిథులకు వసతి
• 32,290 చదరపు అడుగుల సువిశాలమైన బాల్ రూమ్ 3200 మంది అతిథులకు చోటు
• 29,062 చదరపు అడుగుల మొత్తం వైశాల్యంతో 25 సమావేశ గదులు
• అన్ని లెవెల్స్ లో 1,39,930 చదరపు అడుగుల వైశాల్యం గల ప్రీ-ఫంక్షన్ కాన్కోర్స్
• అత్యాధునిక 5G నెట్‌వర్క్ సాయంతో హైబ్రిడ్ మరియు డిజిటల్ అనుభవం
• రోజుకు 18,000 కంటే మించి భోజనాలను అందించే సామర్థ్యం గల అతిపెద్ద వంటగది
• 5,000 కార్ల పార్కింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్‌లో భారతదేశంలో అతిపెద్ద ఆన్-సైట్ పార్కింగ్ సదుపాయం

Also Read

Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు.. కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్.. ట్రెండ్ అవుతున్న వైరల్ వీడియో

Viral Video: ఫోటో షూట్‌కెళ్లి… బురదలో పడ్డ వధూవరులు వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: పిల్లే అయినా పులిలా వేటాడింది.. వీడియో చూస్తే అవాక్ అవ్వాల్సిందే..