Mukesh Ambani
Mukesh Ambani: ఫోబ్స్ జాబితా ప్రకారం.. ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడు, ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో 10వ కొనసాగుతున్న వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశంలోనే విలువైన కంపెనీల్లో ముందంజలో రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) ఉంది. అయితే ఈ రోజు ముకేశ్ అంబానీ పుట్టినరోజు. ఆయన తన 65వ ఏటలోకి(Mukesh Ambani turns 65) అడుగుపెట్టారు. అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్ ప్రస్తుతం 17 లక్షల కోట్ల రూపాయలకు పైగా మార్కెట్ క్యాప్ కలిగి ఉంది. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఆర్‌ఐఎల్ 42వ స్థానంలో నిలిచింది. తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణానంతరం రిలయన్స్ ను ముందుకు తీసుకెళ్లడంలో ముకేశ్ అంబానీ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం..
- 65వ ఏటలోకి అడుగుపెట్టిన భారత సంపన్న వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఏప్రిల్ 19, 1957న జన్మించాడు. ఆయన భారత్ లో జన్మించలేదు. దివంగత ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ దంపతులకు ముకేశ్ యెమెన్‌లో జన్మించాడు. ఆ సమయంలో ధీరూభాయ్ యెమెన్‌లో వ్యాపారం చేసేవారు.
- ముకేశ్ అంబానీ కాలేజీ ఒక డ్రాపౌట్. 1980ల కాలంలో ముకేశ్ అంబానీ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో MBA చదువుతున్నారు. ఆ సమయంలో తండ్రి నిర్వహిస్తున్న వ్యాపారాన్ని చేపట్టడానికి విద్యను మధ్యలోనే ఆపేసి భారత్ కు తిరిగి రావాల్సి వచ్చింది. ముకేశ్ అంబానీ తన తండ్రి ధీరూభాయ్ అంబానీతో కలిసి 1981లో రిలయన్స్ పెట్రోలియం కెమికల్స్‌ను ప్రారంభించారు.
- చాలా కాలంగా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ముకేశ్ అంబానీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన పూర్తి శాఖాహారి కావటం. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇడ్లీ తినడానికి ఇష్టపడతారని తెలుస్తోంది. రోజూ తినే ఆహారంలో పప్పు, అన్నం, రోటీ భాగంగా ఉంటాయి.
- ఐపీఎల్ క్రికెట్ జట్టుకు ముకేశ్ అంబానీ యజమాని అయినప్పటికీ.. ఆయనకు హాకీ అంటే మక్కువ. స్కూల్ డేస్ నుంచి ముకేశ్ హాకీ ఎక్కువగా ఇష్టపడేవారు.
- ముకేశ్ అంబానీ తన స్వభావం, డ్రెస్సింగ్ సెన్స్ పరంగా చాలా సింపుల్. ఆయన ఎప్పుడూ సాధారణ తెల్లని చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించడానికి ఇష్టపడతాడు. ఎప్పుడూ ఏ బ్రాండ్‌ను అనుసరించరు. అంతేకాకుండా ఆయన సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు. వారానికి మూడు సినిమాల వరకూ చూస్తారని తెలుస్తోంది.
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోమ్ ప్రాపర్టీలలో ముకేశ్ అంబానీ ఇల్లు యాంటిలియా అగ్రస్థానంలో ఉంది. దీనిని దక్షిణ ముంబైలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ. 11 వేల కోట్లు. దీనిలో 27 అంతస్తులు, 600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ నివాసంలోని ప్రతి గదిలో ఆయన తండ్రి, కుటుంబ సభ్యుల ఫోటో ఉండటమే.
ఇవీ చదవండి..
Glass Bridge: డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం.. పొడవైన గాజు వంతెన ఎక్కడ ఉందంటే..
Elon Musk: తన ట్విట్టర్ కొనుగోలు పూర్తైతే.. వారి జీతాల ఖర్చు సున్నా డాలర్లవుతుందన్న ఎలాన్ మస్క్..