
Gold Price: దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు రికార్ఢు స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజాగా అక్టోబర్ 21న మధ్యాహ్నం సమయానికి తులం బంగారంపై రికార్డు స్థాయిలో పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 2,080 రూపాయలు పెరిగి రూ.1,32,770 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1900 వరకు పెరిగి ప్రస్తుతం రూ.1,21,700 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే బంగారం పెరిగితే వెండి కాస్త తగ్గుముఖం పట్టింది. అయినా ధర భారీగానే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,70,000 ఉండగా, హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే భారీగా ఉంది. ఇక్కడ కిలో రూ.1,88,000 వద్ద ఉంది.
ప్రస్తుతం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,850 ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,700 ఉంది.
బంగారం ధరలు ఎంత పెరిగాయి?
ఈ సంవత్సరం ప్రారంభం నుండి బంగారం ధరలు 65% కంటే ఎక్కువ పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం దీనికి కారణం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ అనిశ్చితి, సుంకాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
బంగారం ధరలు రూ.1.5 లక్షలకు పెరిగే అవకాశం:
బంగారం కోసం బలమైన డిమాండ్ కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంటున్నారు. అక్టోబర్ చివరి నాటికి ఇది రూ.1.5 లక్షలకు చేరుకోవచ్చు. అమెరికా షట్‌డౌన్ డాలర్‌ను బలహీనపరిచింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాలు పెట్టుబడిదారులను, కేంద్ర బ్యాంకులను పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడానికి ప్రేరేపించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, వడ్డీ రేటు తగ్గింపులు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపాయి. అనిశ్చితి ఉన్న ఈ వాతావరణంలో బంగారం బలమైన లాభాలు కొనసాగే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి