Multibagger Returns: మల్టీబ్యాగర్ స్టాక్స్ ఇన్వెస్టర్లకు తక్కువ కాలంలోనే ఎక్కువ రిటర్న్ ఇస్తుంటాయి. అదే కోవకు చెందినది ఈ రియల్ ఎస్టేట్ స్టాక్(Real Estate stock) కూడా. గత సంవత్సరం రూ. 252 గా ఉన్న ఈ కంపెనీ షేర్ విలువ మార్చి 2022 నాటికి రూ.529కు చేరుకుంది. ఈ కాలంలో ఇన్వెస్టర్లకు 109 శాతం మేర రిటర్న్ ఇచ్చింది. సంవత్సరం క్రితం రూ. 5 లక్షలు బ్రిడ్జ్ ఎంటర్ ప్రైజస్ (Brigade Enterprises) స్టాక్ లో పెట్టుబడి పెట్టగా.. దాని విలువ ప్రస్తుతం రూ. 10.50 లక్షలకు చేరింది. గడచిన 10 సంవత్సరాల కాలంలో షేర్ 1100 శాతం మేర రిటర్న్ అందించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,800 కోట్లుగా ఉంది. కంపెనీ ఆపరేటింగ్ ఇన్కమ్ 2021-24 మధ్య కాలంలో 25 శాతం మేరిగి రూ. 570 కోట్లకు చేరనుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా నేసింది. బెంగళూరు, చెన్నైలలో కంపెనీకి ఉన్న ఖాళీ స్థలాల నుంచి వచ్చే లీజ్ ఆదాయం పెరుగుదల దీనకి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
షేర్ మార్చి 2022లో తన 52 వారాల జీవిత కాల గరిష్ఠమైన రూ. 542ను చేరుకోగా.. ఏప్రిల్ 2021లో తన 52 వారాల కనిష్ఠమైన రూ.230ని తాకింది. Brigade Enterprises సంస్థ బెంగళూరు దేవనహళ్లిలో 66 ఎకారాల్లో రెసిడెంషియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టు వివరాలను కంపెనీ ప్రకటించటంతో షేర్ విలువ 1 శాతం పెరిగిందని ఇండియా ఇన్ఫోలిన్ బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది..
NOTE: షేర్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్న అంశం. పెన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేముందు మీ ఆర్థిక సలహాదారు సలహాలను తప్పక తీసుకోండి.
ఇవీ చదవండి..
FD Interest: పెరిగిన FD వడ్డీ రేట్లు.. SBI, PNB, HDFC, యాక్సిస్ బ్యాంకుల్లో ఎలా ఉన్నాయంటే..
Storing Bananas: అరటిపండ్లు త్వరగా కుళ్ళిపోతున్నాయా.. ఈ చిట్కాలను పాటించండి..