AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆర్బీఐ నిర్ణయంతో వారిపై భారం పడొచ్చు.. స్టాక్ మార్కెట్‌లో కూడా అస్థిరత కొనసాగొచ్చు..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పబ్లిక్ ఆఫర్(IPO) సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచారు. అటూ US ఫెడరల్ రిజర్వ్ సమావేశం తర్వాత పాలసీ రేట్లను 50 బేసిస్ పాయింట్లను పెంచింగి...

RBI: ఆర్బీఐ నిర్ణయంతో వారిపై భారం పడొచ్చు.. స్టాక్ మార్కెట్‌లో కూడా అస్థిరత కొనసాగొచ్చు..
Srinivas Chekkilla
|

Updated on: May 07, 2022 | 12:03 AM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పబ్లిక్ ఆఫర్(IPO) సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచారు. అటూ US ఫెడరల్ రిజర్వ్ సమావేశం తర్వాత పాలసీ రేట్లను 50 బేసిస్ పాయింట్లను పెంచింగి. ఈ రెండు విషయాలే కాకుండా ద్రవ్యోల్బణం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆర్‌బీఐ మధ్యంతర రేట్లను పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం అకస్మాత్తుగా పెరగడానికి ప్రధాన కారణం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం. అయితే ఈ సంక్షోభానికి తక్షణ పరిష్కారం కనిపించడం లేదు. అధిక ముడి ధరలకు దారితీసిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, ప్రపంచ ఆహార ధరలలో రికార్డు పెరుగుదల, ఎరువులు వంటి వ్యవసాయ ఇన్‌పుట్ ఖర్చులు “భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై చెడు ప్రభావం చూపిస్తాయని ఆర్బీఐ గవర్నర్ తన ప్రకటనలో చెప్పారు. మార్కెట్ పార్టిసిపెంట్ల అంచనాలను బట్టి చూస్తే, జూన్ 2022 మొదటి వారంలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ అధికారికంగా ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను సమీక్షించేందుకు సమావేశమైనప్పుడు మరో రేటు పెంపుదలకు అవకాశం ఉంది.

రేట్లు కఠినతరం చేసినందున ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రుణాలు పొందిన వారు, వారి కుటుంబ బడ్జెట్‌లను మళ్లీ లెక్కించవలసి ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో అస్థిరత కూడా చూడొచ్చు. రుణాలు తిరిగి చెల్లించడంలో గృహా లోన్‌ తీసుకున్నవారు ఇబ్బంది పడవచ్చు. అక్టోబరు 2019లో RBI బ్యాంకులు బెంచ్‌మార్క్ లింక్డ్ హోమ్ లోన్‌లను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఆయితే RBI పాలసీ రేట్లను వరుసగా తగ్గించడంతో EMIలు తగ్గాయి. కానీ ఇప్పుడు EMI మొత్తం కూడా పెరుగుతుంది. ఈసారి ఆర్‌బీఐ బెంచ్‌మార్క్ రేట్లను పెంచిన ప్రతిసారీ రుణగ్రహీతలు అప్పులపై కాలానుగుణంగా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. కాబట్టి మీరు గృహ రుణం వంటి పెద్ద రుణాలను పొందినట్లయితే, పాక్షిక ముందస్తు చెల్లింపును పరిగణించవలస ఉంటుంది.

మీరు వెంటనే ముందస్తుగా చెల్లించలేకపోతే, EMI మొత్తం పెరగబోతున్నందున అదనపు ఆదాయం కోసం చూడండి. సరళంగా చెప్పాలంటే, గృహ రుణ గ్రహీతలకు ఈ సమయం చాలా కష్టంగా ఉండొచ్చు. పెరుగుతున్న వడ్డీ రేట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ హోల్డర్‌లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కార్డ్ రేట్లను పెంచడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ బాండ్ ఈల్డ్స్ పైకి దూసుకుపోతున్నాయి. 10 సంవత్సరాల బెంచ్‌మార్క్ బాండ్ ఈల్డ్ 7.4 శాతం మార్కును తాకింది. ఈక్విటీలలో పెట్టుబడి పెట్టిన వారు కఠినమైన వాతావరణాన్ని, వారి పోర్ట్‌ఫోలియోలలో చాలా ఇబ్బుందులు ఎదుర్కొంటారు. అయితే, స్టాక్ ఇన్వెస్టర్లు ఎటువంటి మోకాలి-జెర్క్ రియాక్షన్‌ను నివారించాలి. దీర్ఘకాలికంగా మంచి నాణ్యత గల స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలి. అస్థిర స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులను భయాందోళనకు గురిచేస్తుండగా, ముఖ్యంగా మొదటిసారి పెట్టుబడిదారులు, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు నెమ్మదిగా స్టాక్‌లను కూడబెట్టుకోవడానికి ఇది ఉత్తమ సమయాలలో ఒకటి. సరైన స్టాక్‌లను ఎంచుకోవడంలో నైపుణ్యం లేని వారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకోవాలి.

Read  Also.. Jio Q4 Results: రిలయన్స్‌ జియోకు నాలుగో త్రైమాసికంలో పెరిగిన లాభం.. క్యూ4 ఫలితాలు విడుదల