
RBI: భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక పెద్ద మార్పును ప్రకటించింది. ఇప్పుడు మీరు చెక్కు క్లియర్ కావడానికి రెండు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. బదులుగా చెక్కు ప్రాసెస్ అవుతుంది. కొన్ని గంటల్లోనే మొత్తం ఖాతాకు బదిలీ చేస్తారు బ్యాంకు సిబ్బంది. చెక్ క్లియరింగ్ వేగాన్ని పెంచడం, ఇతర ఇబ్బందులను తగ్గించడం, అలాగే కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడం ఈ కొత్త వ్యవస్థ ఉద్దేశ్యం.
ప్రస్తుతం చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) కింద చెక్కును ప్రాసెస్ చేయడానికి దాదాపు దాదాపు రెండు పని దినాలు పడుతుంది. కానీ ఆర్బీఐ ఇప్పుడు ఈ వ్యవస్థను బ్యాచ్ ప్రాసెసింగ్ నుండి రియలైజేషన్ తర్వాత సెటిల్‌మెంట్‌కు మారుస్తోంది.
ఇది కూడా చదవండి: ICICI: వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్.. అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ పరిమితి తగ్గింపు!
ఈ కొత్త వ్యవస్థను ఎప్పుడు అమలు చేస్తారు?
చెక్కు క్లియరింగ్ కోసం నిరంతర, రియల్ టైమ్ సెటిల్మెంట్ వ్యవస్థ అక్టోబర్ 4, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఈ కొత్త వ్యవస్థ కింద బ్యాంకులు కస్టమర్ల నుండి స్వీకరించిన చెక్కులను స్కాన్ చేసి వెంటనే క్లియరింగ్ హౌస్‌కు పంపుతాయి. ఈ ప్రక్రియ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒకే క్లియరింగ్ సెషన్‌లో నిర్వహిస్తారు.
కొత్త వ్యవస్థ రెండు దశల్లో అమలు:
ఈ కొత్త వ్యవస్థ రెండు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశ అక్టోబర్ 4, 2025 నుండి జనవరి 2, 2026 వరకు ఉంటుంది. రెండవ దశ జనవరి 3, 2026 నుండి పూర్తిగా అమలులోకి వస్తుంది. మొదటి దశలో చెక్కును సమర్పించిన తర్వాత చెక్కు ఆమోదం అయ్యిందా లేదా తిరస్కరించిందా అని అదే రోజు సాయంత్రం 7 గంటలలోపు డ్రాయర్ బ్యాంక్ నిర్ధారించాలి. బ్యాంక్ సకాలంలో స్పందించకపోతే చెక్కు ఆమోదించబడినట్లుగా పరిగణిస్తారు.
రెండవ దశలో 3 గంటల పరిమితి:
జనవరి 2026 నుండి అమల్లోకి వచ్చే రెండవ దశలో డ్రాయర్ బ్యాంకులు ప్రతి చెక్కును కేవలం 3 గంటల్లోపు ధృవీకరించాలి. ఉదాహరణకు ఉదయం 10:30 గంటలకు చెక్కును అందిస్తే సంబంధిత బ్యాంకు మధ్యాహ్నం 1:30 గంటలకు దాని స్థితిని క్లియర్ చేయాలి. గడువులోపు నిర్ధారణ అందకపోతే చెక్కు స్వయంచాలకంగా అంగీకరిస్తారు.
కస్టమర్లకు వెంటనే చెల్లింపు అందుతుంది:
ఈ కొత్త వ్యవస్థ కింద క్లియరింగ్ హౌస్ చెక్కు నిర్ధారణ, సెటిల్మెంట్ సమాచారాన్ని పంపిన వెంటనే ప్రజెంటింగ్ బ్యాంక్ ఆ మొత్తాన్ని కస్టమర్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి భద్రతా ప్రమాదం లేనట్లయితే క్లియరెన్స్ తర్వాత ఒక గంటలోపు ఈ చెల్లింపు చేయడం తప్పనిసరి అని RBI స్పష్టం చేసింది.
బ్యాంకులకు కఠినమైన సూచనలు:
ఈ మార్పు గురించి అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు స్పష్టమైన, సకాలంలో సమాచారం ఇవ్వాలని RBI ఆదేశించింది. అంతేకాకుండా బ్యాంకులు నిర్ణీత తేదీల కంటే ముందే కొత్త CTS ప్రక్రియకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
ఇది కూడా చదవండి: SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఈ లావాదేవీలపై ఛార్జీల మోత.. ఆగస్ట్ 15 నుంచి అమలు!
ఇది కూడా చదవండి: BSNL Best Plan: అతి తక్కువ ధరల్లోనే 365 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి