Fact Check: సెప్టెంబర్‌ నాటికి రూ.500 నోట్లు నిలిచిపోనున్నాయా? ప్రభుత్వం కీలక ప్రకటన

Fact Check: సెప్టెంబర్‌ 2025 నాటికి 500 రూపాయల నోట్లు నిలిచిపోనున్నాయా? కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇలాంటి పెద్ద నోట్లను తొలగించేందుకు సిద్ధమవుతోందా? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజమేనా? ఇలాంటి సమాచారం ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే 2000 రూపాయల నోట్లను నిలిపివేసి మార్కెట్లో ఉన్న మిగిలినా నోట్లను వెనక్కి ఇవ్వాలని సూచిస్తోంది ఆర్బీఐ..

Fact Check: సెప్టెంబర్‌ నాటికి రూ.500 నోట్లు నిలిచిపోనున్నాయా? ప్రభుత్వం కీలక ప్రకటన

Updated on: Jul 13, 2025 | 6:18 PM

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. అమాయకులను మోసగించేందుకు సైబర్‌ నేరగాళ్లు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి నకిలీ సమాచారం నమ్మి చాలా మంది మోసపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే సోషల్‌ మీడియాలో వచ్చేవి అన్ని నమ్మకూడదని సూచిస్తున్నారు అధికారులు. సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా బ్యాంకు అకౌంట్లపై కన్నేసి ఉంచుతారు. లేనిపోని సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ బ్యాంకు అకౌంట్లను లూటీ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఓ సమాచారం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇది కూడా చదవండి: Sanchar Saathi: మీ మొబైల్‌ పోయిందా? నో టెన్షన్‌.. ఈ ప్రభుత్వ యాప్‌ ద్వారా సులభంగా గుర్తించవచ్చు!

ఇవి కూడా చదవండి

అదే 500 రూపాయల నోట్లపై. ప్రస్తుతం చెలామణిలో ఉన్న 500 రూపాయల నోట్లు సెప్టెంబర్‌ నాటికి నిలిపివేయాలని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) ఆదేశాలు జారీ చేసినట్లు నకిలీ వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎలాంటి నిజం లేదని, వీటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని హెచ్చరిస్తోంది.

 

వాట్సాప్‌ ద్వారా, ఇతర సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారం తప్పుడు ప్రచారం అని ఖండించింది. ఇలాంటి సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా సూచిస్తూ పీఐబీ ‘ఫ్యాక్ట్‌చెక్‌’(PIB Fact Check) విభాగం ‘ఎక్స్‌’ ద్వారా సమాచారం అందించింది. రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరింది. ఇలాంటి వార్తలు ప్రతి రోజు వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా వైరల్ అవుతున్నాయని, వాటిని నమ్మకూడదని తెలిపింది.

ఇది కూడా చదవండి: Bank Holidays: వచ్చే రెండు వారాల్లో 6 రోజులు బ్యాంకులు బంద్‌

500 రూపాయల నోట్లు నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఫ్యాక్ట్‌చెక్‌ ద్వారా తెలిపింది. అయితే ఏటీఎంలలో చిన్న నోట్లు రూ.100,200 నోట్ల లభ్యతను పెంచాలని ఆదేశాలు ఉన్నాయి తప్ప ఈ పెద్ద నోట్లను రద్దు చేయడం గానీ, ఏటీఎంలలో నిలిపివేయడం గానీ ఉండదని తెలిపింది. రూ.500 నోట్ల ద్వారా సామాన్యులకు చిల్లర విషయంలో ఇబ్బందులు ఉన్నాయని, ఏటీఎంలలో చిన్న నోట్లు అయిన 100, 200 రూపాయలను పెంచినట్లయితే ఇబ్బంది ఉండదని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి