RBI Monetary Policy: హోం లోన్, కారు లోన్ తీసుకున్నవారికి.. తీసుకోవాలనుకున్నవారికి గుడ్‌న్యూస్.. ఆర్బీఐ కీలక ప్రకటన..

RBI MPC Meeting Today: వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. RBI రెపో రేటు ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది. వడ్డీ రేట్లు పెంచకపోవడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది వరుసగా మూడోసారి. ద్రవ్యోల్బణం అంచనాలను RBI మానిటరీ పాలసీ కమిటీ సవరించింది. గతంలో ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా వేయగా తాజాగా దాన్ని 5.1 శాతంగా మార్చింది. మరో వైపు సెప్టెంబర్‌ 30 నాటికి 2వేల రూపాయల నోట్ల ఉపసంహరణ పూర్తవుతుందని RBI ప్రకటించింది. ఆ లోపే నోట్లను మార్చుకోవాలని RBI ప్రజలను కోరింది.

RBI Monetary Policy: హోం లోన్, కారు లోన్ తీసుకున్నవారికి.. తీసుకోవాలనుకున్నవారికి గుడ్‌న్యూస్.. ఆర్బీఐ కీలక ప్రకటన..
Rbi Governor Shaktikanta Das

Updated on: Aug 10, 2023 | 11:53 AM

రుణ గ్రహితలకు గుడ్ న్యూస్ ప్రకటించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. గృహ రుణం లేదా కారు లోన్ తీసుకోవాలనుకుంటుంటున్నవారికి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఇది మాత్రమే కాదు, మీ హోమ్ లోన్ ఈఎంఐ  ఇప్పటికే అమలవుతున్నప్పటికీ.. ఈ వార్త మీకు ఖచ్చితంగా ఉపశమనం కలిగిస్తుంది. 44వ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ఏప్రిల్, జూన్, ఇప్పుడు ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పాత స్థాయిలోనే కొనసాగించడం ఇది వరుసగా మూడోసారి. జూన్‌లో ఆర్‌బీఐ రెపో రేటును అదే స్థాయిలో 6.5 శాతం వద్దనే కొనసాగించింది.

రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించడమే కాకుండా.. భారత్ సరైన మార్గంలో పయనిస్తోందని.. రానున్న కాలంలో ప్రపంచ వృద్ధి ఇంజిన్‌గా అవతరిస్తుందని.. ప్రపంచంలోనే మనది 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని ధీమా వ్యక్తం చేశారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలు, మన ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నిరంతరం కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులను సద్వినియోగం చేసుకునేందుకు భారత్ ప్రస్తుతం అత్యుత్తమ స్థితిలో అని అన్నారు. ప్రపంచ వృద్ధికి భారత ఆర్థిక వ్యవస్థ 15 శాతం దోహదపడుతోందన్నారు.

ఫిబ్రవరి నెల నుండి రెపో రేటులో ఎటువంటి మార్పు లేదు..

దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయికి చేరుకున్న తర్వాత, రిజర్వ్ బ్యాంక్ దానిని నిర్దేశించిన శ్రేణికి తీసుకురావడానికి మే 2022 నుంచి వరుసగా తొమ్మిది సార్లు రెపో రేటును పెంచింది. ఈ కాలంలో ఈ రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచారు. అయినప్పటికీ, ద్రవ్యోల్బణంపై నియంత్రణతో, సెంట్రల్ బ్యాంక్ దాని పెరుగుదలకు బ్రేక్ వేసింది. ఫిబ్రవరి 2023 నుంచి ఎటువంటి మార్పు చేయలేదు. ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచగలదని నిపుణులు కూడా ఆశించారు. ఇంతకుముందు ఏప్రిల్, జూన్‌లో జరిగిన సమావేశంలో ఈ రేటు స్థిరంగా ఉంచబడింది.

రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును స్థిరంగా ఉంచడంతో, ఆర్‌బిఐ ఎంఎస్‌ఎఫ్, బ్యాంక్ రేటును 6.75 శాతంగా, ఎస్‌డిఎఫ్ రేటును 6.25 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. ఆర్‌బిఐ 2024 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసింది, వచ్చే ఏడాది 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జిడిపి వృద్ధి 6.6 శాతంగా అంచనా వేయబడింది. FY24 మొదటి త్రైమాసికంలో నిజమైన GDP వృద్ధి 8 శాతంగా ఉండవచ్చని శక్తికాంత దాస్ చెప్పారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం