Inflation: RBIకి ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బం.. శ్రీలంకను చూసి మనం నేర్చుకున్నామా..!

|

Jun 09, 2022 | 9:24 AM

Inflation: ద్రవ్యోల్బణం ప్రస్తుతం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇది మన దేశంలో కూడా వేగంగా పెరుగుతోంది. కానీ అంతే వేగంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా చర్య తీసుకుంటోంది.

Inflation: RBIకి ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బం.. శ్రీలంకను చూసి మనం నేర్చుకున్నామా..!
Follow us on

Inflation: ద్రవ్యోల్బణం ప్రస్తుతం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇది మన దేశంలో కూడా వేగంగా పెరుగుతోంది. కానీ అంతే వేగంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా చర్య తీసుకుంటోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ కేవలం 34 రోజుల్లోనే రెండోసారి రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. అందుకే రెపో రేటును 0.50 శాతం పెంచటంతో అది 4.90 శాతానికి పెరిగింది. ఐరోపాలో నెలకొన్న గడ్డు పరిస్థితుల వల్ల ప్రపంచ వాణిజ్యం దెబ్బతింది. దీని ప్రభావం భారత్‌పై కూడా పడిందని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కానీ.. ఈ సంక్షోభ సమయంలో కూడా భారత్ చాలా రంగాల్లో బాగా రాణిస్తోంది. GST వసూళ్లు పెరిగాయి. వాహనాల విక్రయాలు పెరిగాయి. స్టీల్-సిమెంట్ డిమాండ్ పెరిగింది. వ్యవసాయానికి తోడ్పాటునందిస్తోంది. కాబట్టి భారత్‌పై పెద్దగా ఆందోళన లేదని తెలుస్తోంది.

పొరుగున ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితి క్షీణించడానికి వెనుక అతిపెద్ద కారణం ద్రవ్యోల్బణం. కాలక్రమేణా, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీని కారణంగా సామాన్య ప్రజలు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల దేశం దివాళా తీసే దశకు చేరుకుందని అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో ద్రవ్యోల్బణం రేటు 30%కి దగ్గరగా ఉంది. ఇది 40% వరకు వెళ్లవచ్చని అంచనాలు ఉన్నాయి.

రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది.. 

కానీ.. భారత్‌లో పరిస్థితి శ్రీలంక మాదిరిగా లేదు. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్ నెలలో 7.8 శాతంగా ఉంది. ఈ కాలంలో ఆహార ద్రవ్యోల్బణం 8.38%గా ఉంది. ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్ఠమని చెప్పుకోవాలి. అంతకుముందు మే 2014లో ద్రవ్యోల్బణం 8.33%గా నమోదైంది. మార్చి 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.95 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం 15.08 శాతంగా ఉంది. రెపో రేటు పెంపుతో వచ్చే ఏడాదిలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని, అందుకే ఈ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల వెనుక ఆహార ద్రవ్యోల్బణం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏదేమైనా పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.