రిజర్వ్ బ్యాంక్(RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి(RBI Monetary Policy) విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) గురువారం వివరించారు. కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగకపోవడం, అధిక ద్రవ్యోల్బణ భయాల కారణంగా ఈ సారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. రెపోరేటు 4 శాతంగా ఉంచగా.. రివర్స్ రెపోరేటును 3.35శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ఈ సారి కూడా సర్దుబాటు ధోరణినే కొనసాగించనున్నట్లు వెల్లడించారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఇది పదో సారి.
ఈ సమావేశాంలో వృద్ధిరేటు అంచనాలను ఆర్‌బీఐ సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 9.2శాతానికి కుదించింది. డిసెంబరు నాటి సమావేశంలో దీన్ని 9.5శాతంగా అంచనా వేసింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికి 7.8శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ – జూన్‌లో 7.2శాతం, జులై – సెప్టెంబరులో 7శాతం, అక్టోబరు – డిసెంబరులో 4.3శాతం, జనవరి – మార్చిలో 4.5శాతం వృద్ధి నమోదు కావొచ్చని తెలిపింది.2021-22 సంవత్సరానికి, CPI ద్రవ్యోల్బణం అంచనా 5.3 శాతం ఉన్నట్లు చెప్పింది.
Read Also.. Banking News: ఈ రెండు బ్యాంకులు పొదుపు ఖాతా వడ్డీ రేట్లను మార్చాయి.. కొత్త రేట్లు ఇవే..!