Bank Holidays: కస్టమర్లకు అలర్ట్‌.. ఆగస్ట్‌లో 15 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

Bank Holidays: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఆగస్ట్‌ నెలలో బ్యాంకులకు 15 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఆగస్ట్‌ నెల ముగిసే వరకు ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం..

Bank Holidays: కస్టమర్లకు అలర్ట్‌.. ఆగస్ట్‌లో 15 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

Updated on: Aug 03, 2025 | 8:51 AM

చాలా మందికి ప్రతి రోజు బ్యాంకు నిమిత్తం పనులు ఉంటాయి. అలాంటి వారు నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయోనన్న విషయాన్ని ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆగస్టు నెలలో బ్యాంకులకు చాలా రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఏకంగా నెలలో సగం రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఆగస్ట్‌ నెలలో బ్యాంకులకు 15 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఆగస్ట్‌ నెల ముగిసే వరకు ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

➦ ఆగస్టు 3, ఆదివారం: దేశ వ్యాప్తంగా సాధారణ సెలవు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

➦ ఆగస్టు 8, శుక్రవారం: సిక్కిం, ఒడిశా ప్రాంతాల్లో సెలవు (గిరిజన పండుగ.. టెండాంగ్‌లో రమ్ ఫండ్)

➦ ఆగస్టు 9, శనివారం: రెండో శనివారం సాధారణ సెలవు, అలాగే రక్షా బంధన్ పండుగ

➦ ఆగస్టు 10, ఆదివారం: దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

➦ ఆగస్టు 13, బుధవారం: మణిపూర్‌లో రాష్ట్ర స్థాయి పండుగ (దేశ భక్తి దివస్)

➦ ఆగస్టు 15, శుక్రవారం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు

➦ ఆగస్టు 16, శనివారం: జన్మాష్టమి, ఇంకా పార్సీ నూతన సంవత్సర సెలవు

➦ ఆగస్టు 17, ఆదివారం: సాధారణ సెలవు

➦ ఆగస్టు 19, మంగళవారం: త్రిపురలో సెలవు (మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జన్మదినం)

➦ ఆగస్టు 23, శనివారం: నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

➦ ఆగస్టు 24, ఆదివారం: దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు

➦ ఆగస్టు 25, సోమవారం: అసోంలో బ్యాంకులకు సెలవు (శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి)

➦ ఆగస్టు 27, బుధవారం: గణేష్ చతుర్థి సందర్భంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, గోవా, తమిళనాడు, మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు

➦ ఆగస్టు 28, గురువారం: నువాఖై, గణేష్ చతుర్థి సందర్భంగా గోవా, ఒడిశా ప్రాంతాల్లో సెలవు

➦ ఆగస్టు 31, ఆదివారం: సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి. బ్యాంకులకు సెలవు ఉన్న రోజుల్లో ఆన్‌లైన్‌ సేవలు యధావిధిగా కొనసాగుతాయి. ఇందులో ఎలాంటి ఆటంకం ఉండదు. ఏటీఎంలు, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, ఇతర ఆన్‌లైన్‌ లావాదేవీలు కొనసాగుతాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి