మన దేశంలో బంగారం అంటే.. మహిళలు గుర్తుకు తెచ్చుకుంటారు.. అంతగా బంగారం నగలను ఇష్టపడతారు.. స్టేటస్ సింబల్ మాత్రమే కాదు.. ఎప్పుడైనా ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడితే.. తమను బంగారం అందుకుంటుందని భావిస్తారు. అందుకనే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ తమ స్థాయికి తగినట్లు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు.. అందుకనే మనదేశంలో ఒక్క కేరళ రాష్ట్రంలో ఉన్న బంగారం .. కొన్ని దేశాల కంటే ఎక్కువ.. అయితే ఇప్పుడు మహిళలతో పోటీ పడి.. బంగారాన్ని తెగ కొనేస్తోంది ఆర్ బీఐ. అవును గోల్డ్ కొనుగోళ్లలో ఆర్‌బీఐ దూకుడు పెంచింది. దీనికి వెనుక భవిష్యత్ భద్రతపై ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
లేడీస్‌ను మించి బంగారాన్ని తెగ కొనేస్తోంది ఆర్‌బీఐ. టన్నుల టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేస్తూ భారీగా నిల్వలు పెంచుకుంటోంది. బంగారం కొనుగోళ్లలో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది ఆర్‌బీఐ. 2022 సెప్టెంబర్ నాటికి ఆర్బీఐ దగ్గర సుమారు 786 మెట్రిక్ టన్నుల గోల్డ్ ఉన్నట్లు తేలింది. 2020 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు 133 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలుచేసి రికార్డు సృష్టించింది ఆర్బీఐ. ప్రపంచ దేశాల్లో ఏ సెంట్రల్ బ్యాంక్ దగ్గర కూడా లేనివిధంగా బంగారం నిల్వలను పెంచుకుంటూ వెళ్తోంది. ఆర్బీఐ దగ్గరున్న విదేశీ మారక నిల్వల్లో గోల్డ్ వాటా 7.86శాతానికి పెరిగింది. గోల్డ్‌ను అందరూ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తుండటంతో బంగారం నిల్వలను పెంచుకుంటోంది ఆర్బీఐ. అనిశ్చిత పరిస్థితులు, ఆర్ధిక ప్రతికూలతల టైమ్‌లో కరెన్సీ విలువల్లో వచ్చే హెచ్చుతగ్గులు, రిస్క్‌ను మేనేజ్ చేయడానికి బంగారం నిల్వలు ఉపయోగపడనున్నాయి.
ఆర్‌బీఐ బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తుందంటే..?
పెట్టుబడిదారులు స్థిర ఆస్తులపై దృష్టి సారించారు. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత పసిడిపై పెట్టుబడులు అత్యంత భద్రంగా భావిస్తున్నారు ముదుపరులు. గోల్డ్ లోహానికి ప్రపంచవ్యాప్త డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు RBI బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తోందంటే.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున 2023 ఆర్థిక దృక్పథం చాలా అనిశ్చితంగా ఉంది.
ద్రవ్యోల్బణ కాలంలో బంగారం సెంట్రల్ బ్యాంకుల మొత్తం నిల్వలలో చక్కటి బ్యాలెన్స్‌ను సృష్టిస్తుంది. రోజు రోజుకీ పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం.. ప్రతికూల పరిస్థితుల్లో US డాలర్లతో సహా అన్ని ప్రధాన కరెన్సీల విలువ క్షీణించడం.
ద్రవ్యోల్బణ వాతావరణంలో యూరో, పౌండ్, యెన్ మొదలైన కరెన్సీల విలువలో ఏదైనా క్షీణత భారతదేశ ఫారెక్స్ నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది . దీంతో భారతదేశం వంటి వస్తువుల దిగుమతి దేశాల కరెంట్ ఖాతా బ్యాలెన్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫియట్ కరెన్సీ విలువలో ఏదైనా పతనాన్ని బంగారు నిల్వలను పెంచడం ద్వారా ఎదుర్కోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..