ATM
ఏటీఎంల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకునేవారు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల మోసాల్లో పడిపోతుంటారు. అలాంటి వారి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసేటపుడు చాలా సార్లు ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. దీని వలన ప్రజలు మోసానికి గురవుతారు.
మారుతున్న కాలంతో పాటు, ఏటీఎం వినియోగదారుల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో ప్రజలు బ్యాంకులకు వెళ్లే బదులు ఏటీఎం కార్డు నుండి నగదు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న ఏటీఎంల వినియోగంతో దానికి సంబంధించిన మోసాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఈరోజుల్లో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి మోసగాళ్లు కూడా పెరిగిపోతున్నారు. ఏటీఎం మోసాల నుండి కస్టమర్లను సురక్షితంగా ఉంచడానికి ఆర్‌బీఐ కొన్ని భద్రతా చిట్కాలను సూచించింది.
- మీ ఏటీఎం పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయవద్దు. దీనితో పాటు, ఎక్కడైనా రాసి కూడా సేవ్ చేసుకోవద్దు. మొబైల్‌లో కూడా ఏటీఎం పిన్‌లను సేవ్ చేసుకోవద్దు.
- దీనితో పాటు ఏటీఎం మెషీన్‌లో పిన్‌ను నమోదు చేసేటప్పుడు, మీ చేతులతో పిన్ కీప్యాడ్‌ను కవర్ చేయండి. డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు తెలియని వ్యక్తుల సహాయం తీసుకోకండి. దీని వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది.
- ఇది కాకుండా, నగదు ఉపసంహరణ తర్వాత మీరు తప్పనిసరిగా క్యాన్సిల్ బటన్‌ను నొక్కాలి. విత్‌డ్రా ప్రాసెస్ అయిన తర్వాత డబ్బులు, ఏటీఎం కార్డును తీసుకోవడం మర్చిపోవద్దు.
- మీ ఏటీఎం మెషీన్‌లో కార్డ్ చిక్కుకుపోయినట్లయితే, వెంటనే మీ బ్యాంకుకు కాల్ చేసి దాని గురించి తెలియజేయండి. నగదు బయటకు రాకపోయినా, మీరు దాని గురించి బ్యాంకుకు తెలియజేయవచ్చు.
- ఏటీఎంలో డబ్బులు తీసుకునే సమయంలో ఏదైనా సమస్య ఏర్పడి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయి ఏటీఎంలో డబ్బులు రాకపోతే బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ఇలాంటి సమస్య తలెత్తితో ఒక రోజులో డబ్బులు మీబ్యాంకు అకౌంట్‌కు మళ్లీ బదిలీ అవుతాయి. అయినా ముందస్తుగా బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేస్తే బాగుంటుందని గుర్తించుకోండి.
- ఏటీఎం వద్ద డబ్బులు విత్‌డ్రా చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇతర వ్యక్తులతో డ్రా చేయించకూడదు. మీకు తెలియపోతే మీ ఇంట్లో వ్యక్తులను వెంట తీసుకెళ్లాలి తప్ప గుర్తు తెలియని వ్యక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని ఆర్బీఐ హెచ్చరిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి