Bank Merger: మరో రెండు బ్యాంకులు విలీనం.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదం!

అప్పుడప్పుడు బ్యాంకుల్లో కొన్ని కుంభకోణాలు, లోపాలు చోటు చేసుకుంటాయి. బ్యాంకు వినియోగదారులకు సరైన సదుపాయాలు కల్పించడంలో బ్యాంకు విఫలమైతే రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపడుతుంటుంది. కొన్ని బ్యాంకులాను విలీనం చేస్తుంటుంది. దీంతో ఇప్పుడు రెండు బ్యాంకులు విలీనం చేసేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది..

Bank Merger: మరో రెండు బ్యాంకులు విలీనం.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదం!

Updated on: Aug 02, 2025 | 1:24 PM

Bank Merger: దేశంలోనే అతిపెద్ద సహకార బ్యాంకు సరస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ (NICBL)ను విలీనం చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిందని కేంద్ర బ్యాంకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

ఈ విలీనం ఆగస్టు 4, 2025 నుండి అమలులోకి వస్తుంది. సరస్వత్ బ్యాంక్ న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ అన్ని ఆస్తులు, బాధ్యతలను స్వీకరిస్తుంది. అలాగే దాని అన్ని శాఖలు సరస్వత్ బ్యాంక్ శాఖలుగా పనిచేస్తాయి. విలీన తేదీ తర్వాత NICBL అన్ని ఆస్తులు, బాధ్యతలను అలాగే దాని కస్టమర్లను బ్యాంక్ స్వాధీనం చేసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ విలీనం ప్రక్రియం పూర్తి చేయడానికి కేంద్ర బ్యాంకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 44Aలోని సబ్-సెక్షన్ (4) కింద తన అధికారాలను వినియోగించింది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లతో సహా కస్టమర్లను ఆగస్టు 4, 2025 నుండి సరస్వత్ బ్యాంక్ కస్టమర్లుగా పరిగణిస్తారు. వారి ప్రయోజనాలకు పూర్తి రక్షణ ఉంటుంది.

ఇది కూడా చదవండి: Viral Video: దారుణం.. ఇంట్లో దూరిన వీధి కుక్కులు.. పెంపుడు కుక్కను ఎలా చంపాయో చూడండి.. షాకింగ్‌

జూలై 22, 2025న జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సారస్వత్ బ్యాంక్ వాటాదారులచే విలీన ప్రక్రియ ఆమోదించింది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ వాటాదారులచే వారి వార్షిక సర్వసభ్య సమావేశంలో కూడా దీనిని ఆమోదించింది. అలాగే తరువాత ఆమోదం కోసం RBIకి పంపింది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ తన టాప్ మేనేజ్‌మెంట్ సభ్యులతో సంబంధం ఉన్న రూ.122 కోట్ల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి 2025 నుండి నియంత్రణా పరిశీలనలో ఉంది.

ఇది కూడా చదవండి: Bank Account: ఈ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఇంకా 6 రోజులే సమయం.. ఇలా చేకుకుంటే అకౌంట్ క్లోజ్‌!

ఇది కూడా చదవండి: Hero Vida: సింగిల్ ఛార్జింగ్‌తో 142కి.మీ మైలేజ్‌.. ధర కేవలం రూ.45,000 మాత్రమే.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి