
RBI Repo Rate: దేశ ప్రజలకు ఆర్బీఐ గుడ్‌న్యూస్ తెలిపింది. అందరూ ఊహించినట్లుగానే రెపో రేటును మరోసారి తగ్గించింది. ఇప్పటివరకు 5.5 శాతంగా ఉండగా.. శుక్రవారం దానిని 5.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంటే 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇక స్టాడింగ్ డిపాజిట్ ఫెలిసిటీని రేటును 5 శాతానికి పరిమితం చేయగా.. మార్జినల్ స్టాడింగ్ ఫెలిసిటీ రేటును 5.5 శాతంగా కొనసాగించింది. ఈ సంవత్సరంలో రెపో రేటును తగ్గించడం ఇది నాలుగోసారి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 125 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీని వల్ల ఈఎంఐ చెల్లించేవారికి మరింతగా తగ్గనుంది.
డిసెంబర్ 3 నుంచి ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ మీటింగ్‌లో చర్చించిన అనంతరం రెపో రేటు తగ్గింపును ప్రకటించారు. రెపో రేటు తగ్గింపు తక్షణమే అమల్లో రానుందని ఆర్బీఐ వెల్లడించింది. ద్రవ్యోల్బణం తగ్గడం, జీడీపీ వృద్ధి కొనసాగుతున్న క్రమంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక కార్యకలాపాలు మరింత మెరుగుపడటానికి ఆర్బీఐ తాజా డెసిషన్ ఉపయోగపడనుంది. రెపో రేటు తగ్గింపు వెనక కారణాన్ని ఆర్బీఐ తెలిపింది. ద్రవ్యోల్బణం అంచనా బాగా మెరుగుపడిందని, మునుపటి అంచనాల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని గుర్తించామని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో ద్రవ్యోల్బణం 4 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు . విలువైన లోహాల ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణంలో కొంత భాగం పెరుగుతోందని అంచనా వేశారు. ద్రవ్యోల్బణం అనేక సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయిందని, ఆర్థిక వృద్ధి ఆశ్చర్యకరంగా పెరగడంతో ఈ నిర్ణయం నిర్ణయం తీసుకున్నామన్నారు. ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంలో ఉంచుతూ రుణ పరిస్థితులు మద్దతుగా ఉండేలా చూసుకోవడం తమ లక్ష్యమన్నారు.
రెపో రేటు ప్రభావం బ్యాంకుల నుంచి తీసుకునే లోన్లపై ప్రభావితం చూపుతుంది. రెపో రేటు తగ్గింపు వల్ల ఈఎంఐలపై చెల్లించే వడ్డీ అనేది తగ్గుతుంది. దీని వల్ల మీరు చెల్లించాల్సిన ఈఎంఐ తగ్గుతుంది. ఇక రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు కూడా వివిధ రుణాలపై వడ్డీ రేటును తగ్గించాల్సి ఉంటుది. దీని వల్ల కొత్తగా లోన్ తీసుకునేవారికి కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఏ విధంగా చూసుకున్న ఇది ప్రజలకు శుభవార్తగా చెప్పవచ్చు.