Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా ఖాతాదారులకు షాక్, బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు, అసలేం జరిగిందంటే..
ఆర్ బీఐ చర్యల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంకు ఖాతాదారులకు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. లావాదేవీలకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఖాతాల నిర్వహణ, కొత్త ఖాతాల ప్రారంభం, ఇతర వ్యవహారాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వారిలో తలెత్తిన ప్రశ్నలకు సంబంధించి సమాధానాలను తెలుసుకుందాం.

ప్రముఖ ప్రైవేటు రంగ రుణదాత కోటక్ మహీంద్రా బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని ఆంక్షలు విధించింది. దాని ఆన్ లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను ఆన్ బోర్డింగ్ చేయకుండా నిషేధించింది. కోటక్ మహీంద్రా బ్యాంకు ఐటీ వ్యవస్థలో తీవ్ర లోపాలను ఆర్ బీఐ గుర్తించింది. దీంతో తాజాగా క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా పరిమితం చేసింది. 2022, 23 సంవత్సరాలలో ఐటీ ఇన్వెంటరీ మేనేజ్ మెంట్, ప్యాచ్ అండ్ చేంజ్ మేనేజ్ మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్ మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్ మెంట్, డేటా సెక్యూరిటీలలో లోపాలతో పాటు నానా కాంప్లియన్లను ఆర్బీఐ గుర్తించింది.
ఖాతాదారుల్లో గందరగోళం..
ఆర్ బీఐ చర్యల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంకు ఖాతాదారులకు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. లావాదేవీలకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఖాతాల నిర్వహణ, కొత్త ఖాతాల ప్రారంభం, ఇతర వ్యవహారాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వారిలో తలెత్తిన ప్రశ్నలకు సంబంధించి సమాధానాలను తెలుసుకుందాం.
- కోటక్ మహీంద్రా బ్యాంకులోని ఐటీ విభాగానికి సంబంధించి 2022, 23 లో కొన్ని లోపాలను ఆర్ బీఐ గుర్తించింది. ఈ లోపాలను తక్షణమే పరిష్కరించడంలో బ్యాంక్ వైఫల్యం చెందడంతో పరిమితులు విధించింది.
- ఆర్బీఐ నిర్ణయం కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఖాతాదారులపై ప్రభావం చూపదు. ఏటీఎం కార్డులు, డిపాజిట్లు, ఉపసంహరణలు, లాకర్ సేవలు వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, మొబైల్, నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలతో సహా నిరంతరాయ సేవలకు బ్యాంక్ హామీ ఇచ్చింది.
- కొత్త క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లు మాత్రం ఆర్ బీఐ విధించిన పరిమితులకు లోబడి ఉంటాయి. పరిమితికి ముందు దరఖాస్తులను ప్రాసెస్ చేసి ఆమోదించిన వారు తమ క్రెడిట్ కార్డ్‌లను యథావిధిగా స్వీకరించవచ్చు. అయితే బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డ్ దరఖాస్తులను స్వీకరించదు. వాటిని ఆర్‌బీఐ నిషేధించింది.
- కోటక్ లోని 811 బ్యాంక్ ఖాతా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యం. ఆర్ బీఐ ఆంక్షల తర్వాత ఆ బ్యాంక్ ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ చానెళ్ల ద్వారా కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డ్ చేయడం నిలిపివేసింది.
- కోటక్ మహీంద్రా బ్యాంక్ శాఖలు కొత్త క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయవు. కానీ కొత్త ఖాతా తెరిచే అవకాశం ఉంది. నిషేధం కారణంగా కొత్త కస్టమర్లు ఆన్‌లైన్, మొబైల్ చానెల్‌ల ద్వారా మాత్రం ఖాతాలను తెరవలేరు. అంటే కొత్త క్రెడిట్ కార్డుల జారీ మినహా అన్ని బ్యాంకు సేవలను అందిస్తాయి.
- కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్ బీఐ ఆంక్షలు ఎంతకాలం కొనసాగుతాయో తెలిదు. సమగ్ర బాహ్య ఆడిట్, లోపాలను సరిదిద్దిన తర్వాత జరిగే అవకాశం ఉంది. దీనికి నిర్దిష్ట కాలం లేనప్పటికీ సుమారు ఆరు నుంచి 12 నెలల మధ్య సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
- కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు, ఐటీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు చురుకుగా పనిచేస్తున్నట్లు తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




