Indian Railways: దేశంలో అతిపెద్ద రైల్వేస్టేషన్ ఇదే.. ఎన్ని ప్లాట్‌ఫామ్‌లో తెలిస్తే ఆగమే..!

భారతీయ రైల్వేలు ఆధునిక సౌకర్యాలు, విస్తృతమైన కనెక్టివిటీని అందిస్తున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్‌, వాటి పరిమాణం, సౌకర్యాలు, ప్రాముఖ్యత ఆధారంగా కొన్ని రైల్వే ష్టేషన్లు ఎంతో ప్రసిద్ధి చెందినవిగా ఉన్నాయి. ఈ జాబితా పరంగా భారతదేశంలోని అతిపెద్ద రైల్వేస్టేషన్‌ ఏదో తెలుసా..? దాని ప్రత్యేకతలు ఏంటంటే..

Indian Railways: దేశంలో అతిపెద్ద రైల్వేస్టేషన్ ఇదే.. ఎన్ని ప్లాట్‌ఫామ్‌లో తెలిస్తే ఆగమే..!
Howrah Junction

Updated on: Jun 09, 2025 | 6:01 PM

ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వేలు అనేక భారీ రైల్వే స్టేషన్లకు నిలయంగా ఉంది.. భారతీయ రైల్వేలు, స్టేషన్లు ప్రయాణీకులకు, సరుకు రవాణాకు ముఖ్యమైన కేంద్రంగా పనిచేస్తాయి. ఆధునిక సౌకర్యాలు, విస్తృతమైన కనెక్టివిటీని అందిస్తున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్‌, వాటి పరిమాణం, సౌకర్యాలు, ప్రాముఖ్యత ఆధారంగా కొన్ని రైల్వే ష్టేషన్లు ఎంతో ప్రసిద్ధి చెందినవిగా ఉన్నాయి. ఈ జాబితా పరంగా భారతదేశంలోని అతిపెద్ద రైల్వేస్టేషన్‌ ఏదో తెలుసా..? దాని ప్రత్యేకతలు ఏంటంటే..

భారతదేశపు అతిపెద్ద రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లో ఉంది. మన దేశంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా నిలిచింది. దేశంలోనే అతిపెద్దదిగా కోల్‌కతాలోని హౌరా జంక్షన్ నిలిచింది. ఇక్కడ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య, విస్తీర్ణంలో ఇది అతిపెద్ద రైల్వే స్టేషన్. దీనిని 1854లో నిర్మించారు. హౌరా స్టేషన్‌లో 23 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.

హౌరా జంక్షన్‌ స్టేషన్ అద్భుతమైన డిజైన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది తూర్పు భారతదేశాన్ని మిగిలిన రైల్వే వ్యవస్థతో అనుసంధానించి ఉంది. విశేషమేమిటంటే ప్లాట్‌ఫారమ్‌ను దాటడానికి ప్రజలు వంతెన మీదుగా వెళ్లాల్సిన అవసరం లేని విధంగా ఈ స్టేషన్‌ను రూపొందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..