Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ఏసీలు.. రైల్వే కీలక నిర్ణయం

| Edited By: Ravi Kiran

Sep 19, 2024 | 9:33 AM

పండుగ సీజన్లలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వేస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇకపై అన్‌రిజర్వడ్ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు కూడా ఏసీ లాంటి ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ఏసీలు.. రైల్వే కీలక నిర్ణయం
Indian Railways
Follow us on

పండుగ సీజన్లలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వేస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇకపై అన్‌రిజర్వడ్ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు కూడా ఏసీ లాంటి ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వందేభారత్, శతాబ్ది, రాజధాని.. లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రిజర్వేషన్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 3 నెలల ముందు నుంచి ప్రారంభమవుతుంది. ఇక పెద్ద పండుగలు దసరా, సంక్రాంతికి అయితే కన్ఫర్మ్ టికెట్లు అటుంచితే.. ఈ ట్రైన్స్‌లో వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంటుంది. జనాలు తమ సొంత ఊర్లకు ప్రయాణించేందుకు కిక్కిరిసిన అన్‌రిజర్వడ్ బోగీల్లోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అందుకే ఇకపై వారికి కూడా అలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని రైల్వేశాఖ ఆలోచిస్తోంది. ఆ కోవలోనే ఇకపై అన్‌రిజర్వడ్ బోగీలలోనూ ఏసీలు ఇన్‌స్టాల్ చేయాలని నిర్ణయించింది.

ఈ క్రమంలోనే ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ డిజైన్‌ను తయారు చేసింది కేంద్ర రైల్వేశాఖ. ఇటీవల తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు భుజ్-అహ్మదాబాద్ మార్గంలో నడిచింది. ఈ రైలులో దాదాపుగా 270 మంది ప్రయాణీకుల సామర్ధ్యం కలిగిన పలు అన్‌రిజర్వడ్ బోగీల్లో 15-15 టన్నుల ఏసీలను అమర్చారు. మెట్రో ప్రయాణం మాదిరిగానే అనుకున్న క్యాపసిటీ నిండగానే.. బోగీలన్నీ చల్లబడతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరికొద్దిరోజుల్లో ఇదే డిజైన్‌ను ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని అన్‌రిజర్వడ్ బోగీల్లోనూ ఉపయోగించనున్నారు. శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని అమర్చిన ఏసీల కంటే డబుల్ క్యాపసిటీతో కూడిన ఏసీలను అన్‌రిజర్వడ్ బోగీల్లో ఇన్‌స్టాల్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది రైల్వేశాఖ.