Insurance: కేవలం 45పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. ఏంటి నమ్మట్లేదా? అయితే ఈ స్టోరీ చదవండి
చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. కానీ అందరికి కొన్ని విషయాలు తెలిసి ఉండవు. రైలు ప్రయాణం చేసేవారి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందన్న విషయం మీకు తెలుసా? ఈ ఇన్సూరెన్స్ కూడా రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. మీరు రైల్వేలో ప్రయాణిస్తున్నట్లయితే, ఈ ప్రత్యేక బీమా సేవ గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. కేవలం 45 పైసలు..
చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. కానీ అందరికి కొన్ని విషయాలు తెలిసి ఉండవు. రైలు ప్రయాణం చేసేవారి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందన్న విషయం మీకు తెలుసా? ఈ ఇన్సూరెన్స్ కూడా రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. మీరు రైల్వేలో ప్రయాణిస్తున్నట్లయితే, ఈ ప్రత్యేక బీమా సేవ గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. కేవలం 45 పైసలు ఖర్చు చేయడం ద్వారా మీరు ఈ లక్షలాది రూపాయల బీమా కవర్ పొందవచ్చు.
మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడల్లా ఈ ప్రయాణ బీమా తీసుకోండి. ఇది మీ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తుంది. టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో ప్రయాణీకుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా అనే ఆప్షన్ ఉంటుంది. ఇందుకోసం వారి నుంచి నామమాత్రంగా 45 పైసలు వసూలు చేస్తారు.
ఎంత ఖర్చవుతుంది?
రైలు ప్రమాదంలో ప్రయాణికుడు గాయపడితే, అతనికి రూ.7.5 లక్షల బీమా సౌకర్యం లభిస్తుంది. అలాగే రూ.2 లక్షల విలువైన ఆసుపత్రి చికిత్స ఉచితం. ప్రమాదంలో ప్రయాణికుడు చనిపోతే లేదా శాశ్వతంగా అంగవైకల్యం చెందితే, అతని కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల బీమా లభిస్తుంది.
45 పైసల బీమా తీసుకునే వారు మాత్రమే ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు మీరు నామినీ వివరాలను సరిగ్గా పూరించడం మర్చపోవద్దు. ఇది చాలా ముఖ్యమైనది.
క్లెయిమ్ ఎలా పొందాలి?
ఏదైనా ప్రమాదం జరిగితే, టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో ప్రయాణ బీమా తీసుకున్న ప్రయాణికులందరికీ ఇది లభిస్తుంది. ఈ బీమా కింద అతనికి 10 లక్షల రూపాయలు అందుతాయి. అయితే దానిని క్లెయిమ్ చేసే పద్ధతి భిన్నంగా ఉంటుంది. రైల్వే ఈ డబ్బును అందించదు. కానీ ప్రయాణ బీమాను తీసుకున్న సంస్థ ఈ బీమా రక్షణను అందిస్తుంది.
నియమాలు ఏమిటి?
ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ప్రయాణ బీమా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో ఒక PNRలో బుక్ చేసిన అన్ని టిక్కెట్లు ప్రయాణ బీమా ప్రయోజనాన్ని పొందుతాయి. నిర్ధారిత, ఆర్‌ఏసీ టిక్కెట్ హోల్డర్లకు మాత్రమే ప్రయాణ బీమా అందుబాటులో ఉంటుంది. నామినీ లేదా లబ్ధిదారు రైలు ప్రమాదం జరిగిన 4 నెలలలోపు ప్రయాణ బీమాను క్లెయిమ్ చేయాలి. దీని కోసం మీరు బీమా చేసిన కంపెనీకి వెళ్లి మీ వివరాలను తెలియజేయాలి. మీరు కొన్ని రోజుల్లో మీ ప్రయాణ బీమాను అందుకుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి